SAKSHITHA NEWS

సాక్షిత మహబూబ్‌నగర్: తొమ్మిదేళ్ల క్రితం వరకు పాలమూరులో నీళ్లు, కరెంటు, రోడ్లు లేవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎస్.జీ.డీ కార్నింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ బీజేపీ లు చేసిందేమీలేదని… వారికి ఓట్లడిగే హక్కు లేదన్నారు.

తెలంగాణ సస్యశ్యామలమైందని.. దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. మంత్రి కేటీఆర్ ఇతర దేశాలకు వెళ్లి పరిశ్రమల ఏర్పాటు పెట్టుబడులు తీసుకొస్తున్నారన్నారు. అమెరిక తర్వాత కార్పోరేట్ ఆఫీసులకు హైదరాబాద్ హెడ్ క్వార్టర్‌గా మారిందన్నారు. కమాండ్ కంట్రోలర్ ఆఫీసు అమెరికా, ఇంగ్లాండ్ , సింగపూర్ తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు అయ్యిందన్నారు. ఇక రాష్ట్రానికి ఫారెనర్లు క్యూ కడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జాగలేదని… రెండో ఎయిర్ పోర్టు పాలమూరులనే కట్టవలసి వస్తదని మంత్రి మల్లారెడ్డి పేర్కొంది….

WhatsApp Image 2023 06 08 at 4.53.31 PM

SAKSHITHA NEWS