SAKSHITHA NEWS

కృష్ణపట్నం పోర్టు పై చేస్తున్న ఆరోపణలన్నీ దుష్ప్రచారాలు – మంత్రి కాకాణి”*
“మాజీ మంత్రి కిరాయి సోమిరెడ్డి లాంటివారు కృష్ణపట్నం పోర్టుపై చేస్తున్న ఆరోపణలన్నీ దుష్ప్రచారాలేనని అన్న మంత్రి కాకాణి”
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
“నెల్లూరు లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్థన్ రెడ్డి “

ఈ సందర్బంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ…. కృష్ణపట్నం పోర్టుకు సంబందించి వస్తున్న ఉహాగానాలపై స్పష్టత ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశాం అన్నారు
రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలోని కృష్ణ పట్నం పోర్టుపై అనేక ఆరోపణలు చేస్తూ, కంటైనర్ టెర్మినల్ లు మూసి వేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని అవన్నీ అవాస్తవాలు అని పేర్కొన్న మంత్రి కాకాణి*
గత సంవత్సరం పోర్టుకు కార్గో ల ద్వారా 72 కోట్ల రూపాయల పన్నులు వస్తె, ఈ సంవత్సరం ఇప్పటికే 80 కోట్ల రూపాయలు పన్నులు రూపం లో వచ్చాయని తెలిపిన మంత్రి కాకాణి*

రాబోవు ఎన్నికలలో కిరాయి సోమిరెడ్డి పై నేనే పోటీ చేస్తానని… సోమిరెడ్డి పై మళ్ళీ గెలుస్తా అని ధీమా వ్యక్తం చేసిన మంత్రి కాకాణి*

కిరాయి సోమిరెడ్డి లాంటి వారు కృష్ణ పట్నం పోర్టు పై చేస్తున్న ఆరోపణలు అన్నీ దుష్ప్రచారాలే అని మండిపడ్డ మంత్రి కాకాణి*
కృష్ణా పట్నం పోర్టు లో టెర్మినల్ తరలించినా, ఉద్యోగాలు తీసివేసినా, పోర్టు లో స్థానికులకు ప్రాధాన్యత లేకున్నా, పోర్టు అభివృద్ధి చేయకపోయినా అధికార పార్టీకి చెందిన నేనే పోర్టు ముందర కూర్చుని నిరసన చేస్తా అని తెలిపిన మంత్రి కాకాణి*
స్థానికంగా నా నియోజక వర్గ ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం అన్న మంత్రి కాకాణి*
కృష్ణపట్నం పోర్ట్ ప్రతి నెలా, ప్రతి ఏడాది దిన దినాభివృద్ధి చెందుతుందని, కంటైనర్ లావాదేవీలు కృష్ణపట్నం పోర్ట్ లో కొనసాగిస్తామని పోర్టు యాజమాన్యం ప్రకటించిన ఆధారాలను మీడియా ముందు ప్రదర్శించిన మంత్రి కాకాణి*
మార్కెట్ ట్రెండ్ ను బట్టి తేడాలు ఉండొచ్చు కానీ ఉద్యోగులను ఏమాత్రం తగ్గించడం జరగదని చెప్పిన మంత్రి కాకాణి*

కొత్త అవకాశాలతో ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం వృద్ధి చెందుతుందన్న మంత్రి కాకాణి*
వ్యాపారం పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి పెరుగుతున్నదే గాని ఎలాంటి నష్టం లేదని పోర్టు అధికారులు విడుదల చేసిన నివేదికలో తెలిపినట్లు వివరించిన మంత్రి కాకాణి*
1920-21 ఆర్థిక సంవత్సరంలో 3,81,82,305 మెట్రిక్ టన్నుల కార్గో జరగగా 46 కోట్ల 6 లక్షల రూపాయలు రాయల్టీగా వచ్చిందని, 21-21 లో 4,01,20,119 మె.ట. కార్గో జరగగా 54 కోట్ల 89 లక్షల రూపాయలు రాయల్టీగా వచ్చిందని, 22-23లో 4,82,56,939 మె.ట. కార్గో జరగగా 72 కోట్ల 2 లక్షల రూపాయలు రాయల్టీగా వచ్చిందని, 23-24 లో 5,78,16,997 మె.ట.కార్గో జరగగా 88 కోట్ల 91 లక్షల రూపాయలు రాయల్టీగా వచ్చిందని పోర్టు అధికారులు వివరించిన నివేదికలో తెలిపారని మంత్రి కాకాణి*
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేవలం డబ్బులు కోసం ఎన్నోసార్లు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని బెదిరించాడని ఆరోపించిన మంత్రి కాకాణి*
కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం సోమిరెడ్డిని పట్టించుకోకపోవడంతో కృష్ణపట్నం పోర్టుపై సోమిరెడ్డి ఆరోపణలకు దిగుతున్నాడన్న మంత్రి కాకాణి*
కిరాయి సోమిరెడ్డి లాంటి వారు చేస్తున్న ఆరోపణలన్నీ దుష్ప్రచారాలేనని, ఎవ్వరూ నమ్మవద్దని, పోర్టు అభివృద్ధికి, ప్రజలకు అండగా నిలిచేందుకు, ఉద్యోగుల భద్రత కోసం ఎప్పటికీ కట్టుబడి పని చేస్తానని ప్రకటించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్థన్ రెడ్డి *

Whatsapp Image 2024 01 25 At 6.29.55 Pm

SAKSHITHA NEWS