SAKSHITHA NEWS

సర్వేపల్లి లో సోమిరెడ్డికి మరోసారి ఓటమి ఖరారు అయింది”

“సోమిరెడ్డిని 5వ సారి ఓడించి ఘనంగా వీడ్కోలు పలకనున్న సర్వేపల్లి ప్రజలు”

జరిగే ఎన్నికలలో సోమిరెడ్డికి డిపాజిట్ కూడా దక్కదు”మంత్రి కాకాణి కి బ్రహ్మరథం పట్టిన పొదలకూరు గ్రామప్రజలు”

“కె ఆర్ ఆర్ నగర్ లో ప్రచారానికి వచ్చిన మంత్రి కాకాణి కి ప్రతి ఇంట మహిళలు మంగళ హారతులు ఇచ్చి, పురుషులు పూలమాలలు వేసి ఘనంగా ఆహ్వానించారు”మా ఇంటి బిడ్డవు నువ్వే, మేమంతా నీ వెంటే అంటూ కాకాణి వెంట నినాదాలతో హోరెత్తించిన స్థానికులు”ఎన్నడూ ఊహించని అభివృద్ధి చేశావంటూ భావోద్వేగానికి గురైన స్థానిక కుటుంబాలు”స్థానికులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి ఆశీస్సులు అందుకొని ముందుకు నడిచిన మంత్రి కాకాణి”సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి”

“ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలు చల్లి, డప్పు వాయిద్యాలు, బ్యాండ్ మేళాలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల మధ్య అత్యంత అట్టహాసంగా కొనసాగిన మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం”మంత్రి కాకాణి ప్రచారంలో ప్రజల నుండి భారీగా స్పందన””ప్రజలందరూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు – మంత్రి కాకాణి”వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంది కాబట్టే గ్రామాలలో పర్యటించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది – మంత్రి కాకాణి”2014 ఎన్నికలప్పుడు టిడిపి, బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిలబెట్టుకోలేదు – మంత్రి కాకాణి”2019 ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నిలబెట్టుకున్నారు – మంత్రి కాకాణి”5 విడతలలో 13,500 వంతున 67,500 రూపాయలు రైతుల ఖాతాలలో నేరుగా జమ చేశామన్న మంత్రి కాకాణి””వైయస్సార్ చేయూత కింద మహిళలకు 75 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించిందన్న మంత్రి కాకాణి”

“దేశంలో ఎక్కడా లేని విధంగా 3 వేలు పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని పేర్కొన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి కార్యాలయంలో ప్రతిరోజు జరుగుతున్న చేరికలు మొత్తం ఫేక్ చేరికలని విమర్శించిన మంత్రి కాకాణి”

“అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, దాచుకోవడమే ధ్యేయంగా సోమిరెడ్డి పని చేశాడని, అందుకనే సోమిరెడ్డిని చూస్తే సర్వేపల్లి ప్రజలు ఛీదరించుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించిన మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి పరిస్థితి చివరికి ఎలా తయారైందంటే ఆటోలు తోలుకుని సోమిరెడ్డి దగ్గరకు వెళ్తే ఆటో డ్రైవర్ లకు కూడా కండువాలు వేసే పరిస్థితి ఏర్పడిందన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి నియోజకవర్గానికి ఎటువంటి సంబంధం లేని కొంతమందికి కండువాలు వేసి టిడిపిలో చేరినట్లు సోమిరెడ్డి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాలలో మీ ఇంటి బిడ్డగా వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్న మంత్రి కాకాణి”

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

“సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, కె ఆర్ ఆర్ నగర్, టైలర్స్ కాలనీలో ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు”

“టిడిపి తరపున సర్వేపల్లి లో ఎవరు పోటీ చేసినా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దే అన్న మంత్రి కాకాణి”

ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ… సర్వేపల్లి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తూ ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్న మంత్రి కాకాణి సోమిరెడ్డి ముసలి కన్నీరు కార్చుకుంటూ నియోజకవర్గం లో తిరుగుతున్నాడన్న మంత్రి కాకాణి

సోమిరెడ్డి రకరకాలు విన్యాసాలు ప్రదర్శిస్తూ ఓట్ల కోసం తిరుగుతున్నాడు అన్న మంత్రి కాకాణి అల్లీపురం రెడ్డిని నాలుగు సార్లు ప్రజలు తరిమి కొట్టినా బుద్ధి మాత్రం రాలేదని విమర్శించిన మంత్రి కాకాణి

సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతుంటే దీనిపై పోరాటం చేసిన చరిత్ర తమదని తెలిపిన మంత్రి కాకాణిఅల్లీపురం రెడ్డికి కనీసం సర్వేపల్లి లో ఓటు కూడా లేదని, ఆయన ఓటు కూడా ఆయన వేసుకోలేడని ఎద్దేవా చేసిన మంత్రి కాకాణి

కరోనా నేపథ్యంలో సర్వేపల్లి ప్రజలకు 3 కోట్ల రూపాయలు విలువైన బియ్యం, మంటనూనె పంపిణీ చేశామన్న మంత్రి కాకాణి కరోనా కష్టకాలంలో ముస్లింలు రంజాన్ పండుగ జరుపుకునేందుకు పండుగ సామాగ్రిని అందించి ముస్లిం కుటుంబాలలో ఆనందాన్ని నింపామన్న మంత్రి కాకాణి కరోనా సమయంలో సర్వేపల్లి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే సోమిరెడ్డి ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాదుకు వెళ్లి దాక్కున్నాడన్న మంత్రి కాకాణి

కరోనా సమయంలో తనకు ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతోనే సోమిరెడ్డి నెల్లూరు నుంచి హైదరాబాద్ కి మకాం మార్చాడన్న మంత్రి కాకాణి ప్రజలు కష్టాలలో ఉంటే వారిని వదిలి వెళ్ళిన సోమిరెడ్డిని ప్రజలు నమ్మవద్దన్న మంత్రి కాకాణి

కరోనా సమయంలో సర్వేపల్లి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రతి ఇంటికి బియ్యం, నూనె ఇతర వస్తువులను అందించిన ఘనత తమకే దక్కుతుందని పేర్కొన్న మంత్రి కాకాణి ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయల విలువైన సామాగ్రిని అందజేశామని తెలియజేసిన మంత్రి కాకాణి

ఇప్పటికే నాలుగు సార్లు అల్లీపురం రెడ్డిని ప్రజలు తరిమి కొట్టారని అయినా నేడు తనకు చివరి ఎన్నిక అంటూ ముసలి కన్నీరు కార్చుకుంటూ గ్రామాలలో తిరుగుతున్నడన్న మంత్రి కాకాణి సోమిరెడ్డి తన స్వార్ధపు రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టాడన్న మంత్రి కాకాణి

సోమిరెడ్డి దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకొని 10 తరాలకు సరిపడా దోచుకుతిన్నాడన్న మంత్రి కాకాణి సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ధాన్యానికి కనీసం గిట్టుబాటు ధర కూడా రాలేదని.. దళారులు, రైస్ మిల్లర్ లతో కుమ్మక్కై కమిషన్ లు దిగమింగాడన్న మంత్రి కాకాణి రైస్ మిల్లర్ ల వద్ద సోమిరెడ్డి 50 కోట్ల రూపాయలు చందాలు దండుకోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారు అన్న మంత్రి కాకాణి సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రైతులు తమ ధాన్యాన్ని 12 వేలు లేదా 13 వేలకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారన్న మంత్రి కాకాణి

తాను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ప్రస్తుత తరుణంలో రైతులు తమ ధాన్యాన్ని 22 వేల నుండి 24 వేల వరకు అమ్ముకొని సంతోషంగా ఉన్నారన్న మంత్రి కాకాణి కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసేందుకు సోమిరెడ్డి తిరుగుతున్నాడని, అలాంటి వ్యక్తి మాటలను నమ్మవద్దన్న మంత్రి కాకాణితనకు చివరి ఎన్నిక అని తిరుగుతున్న సోమిరెడ్డికి ఓటు వేస్తే.. మీకు నాకు సంబంధం లేదని సోమిరెడ్డి పరావర్ అయిపోతాడు అన్న మంత్రి కాకాణి

సోమిరెడ్డికి ఓటు వేస్తే సోమిరెడ్డి కోసం నియోజకవర్గంలో తిరుగుతున్న సోమిరెడ్డి కొడుకు, కోడలే ఆయన ఎక్కడ ఉన్నాడు తెలియదంటారన్న మంత్రి కాకాణి చివరి ఎన్నిక అని ఎక్కడ ఉంటాడో తెలియని సోమిరెడ్డికి ఓటు వేస్తే.. మీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అనేది ఒకసారి ఆలోచన చేయండి అన్న మంత్రి కాకాణి సర్వేపల్లి నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ప్రజలకు అవసరమైన సిమెంట్ రోడ్ లు, సైడ్ డ్రైన్ లు, సాగునీరు, త్రాగునీరు లాంటి అన్ని మౌలిక వసతులను కల్పించామన్న మంత్రి కాకాణి గడిచిన 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేశామని పేర్కొన్న మంత్రి కాకాణి

సర్వేపల్లి ఇంటి బిడ్డగా ఉన్న తన పనితీరును.. సర్వేపల్లి కి ఎటువంటి సంబంధం లేకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అల్లీపురం రెడ్డిగా ఉన్న సోమిరెడ్డి పనితీరును ప్రజలు గమనించి ఓటు వేయాలని కోరిన మంత్రి కాకాణి 2014 ఎన్నికల సమయంలో టిడిపి, జనసేన, బిజెపి ఒక కూటమిగా ఏర్పడి రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, గిరిజనులకు పక్కా గృహాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వంటి 607 హామీలు ఇచ్చి వాటిలో 6 హామీలు కూడా అమలు చేయలేదన్న మంత్రి కాకాణిరాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలను మోసం చేయడమే అనిగా పెట్టుకున్నాడు అన్న మంత్రి కాకాణి 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నిలబెట్టుకున్నారన్న మంత్రి కాకాణి

మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని, రాజకీయాలకతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందజేశామన్న మంత్రి కాకాణి

ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరితేనే తనకు ఓటు వేయాలని ధైర్యంగా అడగగలిగే వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడిన మంత్రి కాకాణి

సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజకీయాలు చూడలేదని, పేదరికమే అర్హతగా చూసామన్న మంత్రి కాకాణి

కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దామన్న మంత్రి కాకాణి రైతుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేశామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా వైసీపీ ప్రభుత్వం పని చేసిందన్న మంత్రి కాకాణి చంద్రబాబు డ్వాక్రా రుణాలకు సంబంధించి మాట తప్పితే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 4 విడతలలో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి అని కొనియాడిన మంత్రి కాకాణి హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు కావాలా.. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి కావాలో ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి కాకాణి ప్రజలందరూ కూడా గ్రామాలలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను గమనించాలని, గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను గమనించి ఆలోచన చేయాలని, అని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, తనకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరిన రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి “

WhatsApp Image 2024 04 08 at 1.43.02 PM

SAKSHITHA NEWS