SAKSHITHA NEWS

గురువిందపూడిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు – మంత్రి కాకాణి”

సాక్షితనెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గ మనుబోలు మండలం గురువిందపూడి సచివాలయ పరిధిలో రెండవ రోజు “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .
85 లక్షల రూపాయల పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రి కాకాణి.

ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని గుర్తించి పరిష్కరించే అద్భుతమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేశారు.
తెలుగుదేశం హయాంలో శంకుస్థాపన శిలాఫలకాలు తప్ప, ప్రారంభోత్సవ శిలాఫలకాలు లేవు.
తెలుగుదేశం నాయకులు ఎన్నికలప్పుడు ప్రజలకు భ్రమ కల్పించేందుకు శంకుస్థాపనలు చేసేవారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామాలలో సిమెంట్ రోడ్లు, అవసరమైన చోట సైడ్ డ్రైన్లను నిర్మించడం జరిగింది.
గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కొదువ లేకుండా అన్ని పనులను పూర్తి చేస్తున్నాం.
భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .
2,750/- రూపాయలు పెన్షన్ ను అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఒకటో తేదీ కల్లా ఠంఛన్ గా ఇంటి తలుపు తట్టి అందిస్తున్నాం.
భారతదేశంలో అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం, మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల సంక్షేమంపై శ్రద్ధ పెట్టలేదు.
జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేసి, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 4 ఏళ్ల కాలంలో గురివిందపూడి గ్రామంలో 3 కోట్ల 30 లక్షల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది.
గ్రామాలలో అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది.


SAKSHITHA NEWS