వినుకొండ లో ప్రభుత్వ భూములకు దొంగ దారిన అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు..
పెద్ద మొత్తంలో మూడుపులు..
సెలవు పై వెళ్ళిన సబ్ రిజిస్టర్..
ఇన్చార్జి తోనే రిజిస్ట్రేషన్లు కొనసాగింపు..
పల్నాడు జిల్లా.
వినుకొండపట్టణం
వినుకొండ లో రాత్రి 8 గంటల సమయం లో
సబ్ రిజిస్టార్ కార్యాలయం తెరుచుకునే ఉంది. ఏమిటా అని మీడియా వారు అక్కడికి వెళ్లి పరిశీలిస్తే..
అధికారులకు ముచ్చెమటలు.. హడావుడిగా తలుపులు మూసే ప్రయత్నం..
ఏమిటా అని తీరా ఆరా తీస్తే ప్రభుత్వ భూమిని దొంగ చాటుగా రిజిస్టర్ చేస్తున్నారన్న గుట్టు బయటికి వచ్చింది.
మార్కాపురం రోడ్డు లోని ప్రభుత్వ పోరంబోకు కుంట భూములను యదేచ్చగా కొందరు వ్యాపారులు రాజకీయ నాయకుల కనుసన్నల్లో డాలర్ సిటీ పేరుతో వెంచర్లు వేశారన్న విమర్శలు సర్వత్ర వినవచ్చాయి.
ఈ నేపథ్యంలో కొందరు ప్రజా సంఘాల వారు ఈ అక్రమాలపై లోకాయుక్త లో కూడా ఫిర్యాదు చేశారు కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేయడంతో విచారణ కొనసాగుతుంది విచారణలో ఉన్న పట్టించుకోకుండా గుట్టుచప్పుడుగా బుధవారం రాత్రి డాలర్ సిటీలో 40 ప్లాట్లను యదేచ్ఛగా రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయడం అర్ధరాత్రి అక్రమాలపై ప్రజాసంఘాలు నిలదీస్తున్నాయి.
దీనిపై రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని వివరణ కోరగా.. మాదేమీ లేదు ఏదో పెండింగ్ వరకు చేసుకుంటున్నాం.. అని డాలర్ సిటీ ప్లాట్ల గురించి మాట్లాడితే నోరు మెదపలేదు మీకు సొంతంగా ఏదైనా ఉంటే తెచ్చుకోండి చేసి పెడదాం అంటూ మీడియా నోరు మూపించే ప్రయత్నం చేశారు.
రేపు రిజిస్టార్ వస్తారు ఆయనే అన్ని చూసుకుంటారు అంటూ దాటవేశారు.
ఇలా అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ లపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.
పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు కూడా ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నారు.
దీనిపై బిజెపి నేతలు డాలర్ సిటీ ప్రాంతాన్ని కూడా సందర్శించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికైనా ఆ 40 ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని లేనట్లయితే లోకాయుక్తకు మరోసారి ఫిర్యాదు చేస్తామని ఆందోళనకు కూడా సిద్ధమవుతామని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.