Meeting with Basti Presidents
సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ వీవీ నగర్ వార్డ్ కార్యాలయం లో వాటర్ వర్క్స్ సిబ్బంది మరియు ఎలక్ట్రికల్ సిబ్బందితో కలిసి డివిజన్ లోని డ్రైనేజీ, వాటర్ లైన్స్,మరియు విద్యుత్ సమస్యల మీద బస్తి ప్రెసిడెంట్స్ తో కలిసి సమావేశం ఏర్పాటు చేసి చర్చించటం జరిగింది .
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి నిధులు విడుదల అయ్యాయని వాటి ద్వారా కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ వేయాలో చర్చించారు ,అలాగే ఇంకా కొన్ని బస్తీల్లో డ్రైనేజీ పాత లైన్స్ మరియు చిన్నగా ఉండటం వల్ల అవి తొందరగా నిండి పొంగుతున్నాయని, అటువంటి బస్తీల్లో కొత్త డ్రైనేజీ లైన్స్ కొరకు ప్రపోసల్స్ పెట్టాలని మరియు కొన్ని బస్తీల్లో కొత్త వాటర్ లైన్స్ వేయటానికి ప్రపోసల్స్ పెట్టాలని చర్చించారు.
ఈ కార్యక్రమంలో సి.పి.డి.సి.యల్ శ్రీనివాస్ , వాటర్ వర్క్స్ డి.జి.ఎం రవి , సూపర్ వైజర్ మూర్తి, లైన్ మ్యాన్ మొగులయ్య, డివిజన్ ప్రెసిడెంట్ ఐలయ్య, కో ఆర్డినేటర్ వీరా రెడ్డి,ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్,యోగిరాజ్,బస్తి ప్రెసిడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.