
మహీంద్రా కంపెనీ INTUC ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మహీంద్రా కంపెనీ INTUC యూనియన్ అధ్యక్షులు జనక్ ప్రసాద్ .
జహీరాబాద్ లోని మహీంద్రా కంపెనీ INTUC యూనియన్ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మహీంద్రా కంపెనీ INTUC యూనియన్ అధ్యక్షులు జనక్ ప్రసాద్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంఘం INTUC అని అత్యంత అనుభవం కార్మికుల సంక్షేమం పట్ల పోరాడే పటిమ ఉన్న నాయకులు డా జి సంజీవ రెడ్డి నాయత్వం ఉందని, ఎన్నో ఏళ్లుగా కార్మిక రంగంలో ఉండి ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్న ఘనత INTUC కి ఉందని, ఎన్నో అగ్రిమెంట్లు అనేక ఒప్పందాలు చేశామని CITU యునియన్ ఆగడాలను ఎండగడుతూ త్వరలో జరిగే యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో INTUC గెలుపే లక్ష్యంగా పని చేయాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహ రెడ్డి, యూనియన్ నాయకులు సంపత్ కుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app