SAKSHITHA NEWS

నా ఖమ్మం కోసం నేను”.
వరద బాధితులకు అండగా శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు.

ఖమ్మం పట్టణం మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి కొట్టుకుపోవటంతో పాటు చాలామంది ప్రజలు తమ ఇళ్ళను మరియు ప్రాముఖ్యమైనటువంటి వివిధ రకమైనటువంటి డాక్యుమెంట్ పేపర్స్ ను కోల్పోవటం జరిగింది. మున్నేరు వరద బాధితులను ఆదుకునేందుకు” నా ఖమ్మం కోసం నేను “అనే కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాల ప్రజల బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా స్పందించి సాయాన్ని అందించడం జరిగింది.

ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులను, మూడు క్వింటాల రైస్ బాగ్స్ నీ, 20 వేల రూపాయల చెక్కు ను ఖమ్మం కలెక్టరేట్ భవనంలో జాయింట్ కలెక్టర్ అయినటువంటి పొడి శెట్టి. శ్రీజ కి , ఖమ్మం Z.P. C.E.O. శ్రీమతి .దీక్ష రైనా కి మరియు ఖమ్మం DRDA ఆర్. సన్యాసయ్య కి శ్రీ గ్లోబల్ హైస్కూల్ ఫౌండర్ అయినటువంటి ఇనుకల దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు కరస్పాండెంట్ వాహిని మేడం, తిరుపతి రెడ్డి ,సుధాకర్ రెడ్డి మరియు పాఠశాల ప్రిన్సిపల్ రామారావు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు వరద బాధితుల సహాయార్థం విరాళాలను అందించడం జరిగింది.


SAKSHITHA NEWS