SAKSHITHA NEWS

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిధిగా ప్రగతి నగర్ సాయి బాబా ఆలయంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా 5వడివిజన్,మరియు కాలనీ వాసులకు,చిన్నారులకు సాయి బాబా ఆలయ కమిటీ చైర్మన్, సీనియర్ నాయకులు చల్లా సుధీర్ రెడ్డి ,మరియు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్,స్వతంత్ర కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మీ కుమారి, NMC తెరాస వైస్ ప్రెసిడెంట్ రాములు నాయక్,ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ రెడ్డి,జనరల్ సెక్రటరీ ధనరాజ్,జాయింట్ సెక్రటరీ రమేష్,రంగారెడ్డి,వెంకట్ రెడ్డి,వెంకటయ్య,పెంటయ్య, విశ్వనాధ్,శ్యామల దేవి, జగదీశ్రీ,ఇతర ముఖ్య సభ్యులు,స్థానిక డివిజన్ తెరాస అద్యక్షులు, మరియు అనుబంధ కమిటీల సభ్యులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు మహిళా నాయకులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.