అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత

Spread the love

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం-నగర మేయర్ డాక్టర్ శిరీష

యోగ సాధన ప్రతి ఒక్కరికి బాల్యం నుండి అలవాటు చెయ్యాలి -నగర కమిషనర్ హరిత

యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు జిల్లా మరియు “తిరుపతి నగర పాలక సంస్థ” సంయుక్త ఆధ్వర్యంలో నేడు తిరుపతి ప్రకాశం పార్క్ లో ‘9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ డాక్టర్ శిరీష, కమీషనర్ హరిత ముఖ్య అతిధులుగా హాజరై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కామన్ యోగా ప్రోటోకాల్ ను తగిన సమయంలో అందరితో పాటు సాధన చేసారు. అనంతరం తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ, యోగ సాధన మానసిక, శారీరక రుగ్మతలకు ఒక దివ్య ఔషదమని తెలిపారు.

యోగా సాధన క్రమశిక్షణ గల జీవన విధానాన్ని అందిస్తుందని తెలిపారు. సుమారు 5000 సంవత్సరాలు చరిత్ర కలిగిన యోగ శాస్త్రం భారతదేశం యొక్క సంపద. నేడు ప్రపంచo మొత్తం యోగ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆచారిస్తున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో యోగ, ప్రాణాయామ, ధ్యానం ప్రాముఖ్యత పెరిగిందని తెలిపారు. యోగా చెయ్యడం వలన ఫ్లెక్సీబిలిటీ, ఫిట్నెస్, ఆరోగ్యం, రోగ నిరోధక శక్తీ పెరుగుతుందని తెలిపారు.

యోగా అంటే ఐక్యత. అందుకే యోగ సాధనతో వసుదైక కుటుంబం నినాదంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. అలాగే తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ హరిత మాట్లాడుతూ, యోగ సాధన ప్రతి ఒక్కరికి బాల్యం నుండే అలవాటు చెయ్యాలని తల్లి తండ్రులకు సూచించారు. యోగ తో పాటు పిల్లలకి ఇష్టమైన వ్యాయామం, క్రీడలను ప్రోత్సాహిం చాలని తెలిపారు. యోగ సాధనతో పిల్లల ఏకగ్రత, జ్ఞాపక శక్తీ పెరుగుతుంది కాబట్టి నిరంతర సాధన అలవాటు చేసుకోవాలని కోరారు. తల్లితండ్రులు కూడా సాధన చేస్తూ పిల్లలతో చేయించడం మంచిదని తెలిపారు. అనంతరం 9 వసంతాలు పూర్తి చేసుకున్న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత చిన్నపిల్లల చే ప్రదర్శింపబడిన సంగీత తో కూడిన యోగ విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. చిన్నారులకి ముఖ్య అతిధుల చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యోగ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు అధ్యక్షత వహించగా, యోగ మాస్టర్ కల్పలత అందరిచే యోగ సాధన చేయించారు. అసోసియేషన్ సభ్యులు కిరణ్ కుమార్, హైమావతి, శివ, యుగంధర్, రామూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page