ప్రజా సమస్యల పరిష్కారం కోసం మే గ్రీవెన్స్
- పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రివేన్స్ కార్యక్రమం సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…
ఫిర్యాదులపై బాధితులు అనుమానాలను నివృత్తి చేస్తూ పారదర్శకతను పెంపొందించాలని సూచించారు. వాస్తవ పరిస్థితులకు పరిశీలించి…
త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ సమస్య గల కారణాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్ధాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదులో అధికంగా భూ వివాదాలు, కుటుంబ , వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు.