తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీ నారాలోకేష్ యువగళం పాదయాత్ర త్వరలో అనంతపురం జిల్లాలో పూర్తి చేసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నందున ఈ ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ నాయకులతో ఇరు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిసెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు పార్లమెంట్), గౌరు వెంకట రెడ్డి (నంద్యాల పార్లమెట్) అధ్యక్షుల అధ్యక్షతన కర్నూలు నగరంలోని సోమవారం మౌర్యా ఇన్ నందు నందు సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశమునకు జోన్ 5 ఇంచార్జి ఎన్.అమర్నాథ్ రెడ్డి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రయాదవ గార్లు ముఖ్యులుగా హాజరయి యువగళం పాదయాత్ర ఏర్పాట్ల విషయమై చర్చించడం జరిగింది.
సమావేశమునకు తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ 2019 అభ్యర్ధి మాండ్ర శివానంద రెడ్డి, ఎం.ఎల్.సి లు ఎన్.ఎం.డి.ఫరూక్, కె.ఇ.ప్రభాకర్, బి.టి.నాయుడు, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జీలు బుడ్డా రాజశేఖర రెడ్డి (శ్రీశైలం), టి.జి.భరత్ (కర్నూలు), గౌరు చరితా రెడ్డి (పాణ్యం), భూమా బ్రహ్మానంద రెడ్డి (నంద్యాల), బి.సి.జనార్ధన్ రెడ్డి (బనగానపల్లె), మన్నె ధర్మారం సుబ్బా రెడ్డి (డోన్), కె.ఇ.శ్యాం బాబు (పత్తికొండ), ఆకెపోగు ప్రభాకర్ (కోడుమూరు), డాక్టర్ బి.వి.జయనాగేశ్వర రెడ్డి (ఎమ్మిగనూరు), పి.తిక్కా రెడ్డి (మంత్రాలయం), కోట్ల సుజాతమ్మ (ఆలూరు), కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి కొంకా భూపాల్ చౌదరి, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు ఎర్రసాని నాగేశ్వరరావు యాదవ్, పి.జి.నరసిమ్హులు యాదవ్, బత్తిన వెంకట రాముడు, నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవికుమార్, వైకుంటం మల్లికార్జున చౌదరి అ.వి.ఆర్.కె ప్రసాద్,రామచంద్రరావు దేవెళ్ళ మురళి, యస్.సవితమ్మ, జిల్లెల శ్రీ రాములు,ఎన్.టి.రామాంజనమ్మ, వెంకటశివుదు యాద్వ, మాజి జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ మొదలగు వారితో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ నాయకులతో మౌర్యా ఇన్ నందు నందు సమావేశం
Related Posts
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో
SAKSHITHA NEWS పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో…
సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండి
SAKSHITHA NEWS సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండిజిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్చిలకలూరిపేట:ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసి, పేదల పక్షాన నిలబడే పార్టీ సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ మారుతీవరప్రసాద్ చెప్పారు. ఆయన ఈ నెల 26వ…