పత్రికా ప్రకటన 15/ 03/2023
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిజమైన వారసుడు మాన్యశ్రీ కాన్షీరామ్..
యర్రగొండపాలెం (మండలం)
పట్టణంలోని సన్ జో సేవాలయ మానసిక వికలాంగుల ఆశ్రమంలో మాన్యశ్రీ కాన్షీరామ్
89వ జయంతి వేడుకను యర్రగొండపాలెం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ రాచేటి ప్రసాద్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 31వ ఏటనే అంబేద్కర్ రచించిన ‘కుల నిర్మూలన ‘ గ్రంథం ద్వారా ప్రేరేపితుడై తన తల్లికి ముప్ఫై పేజీల ఉత్తరం రాస్తూ ‘ఇక నుంచి నేను కుటుంబ బాంధవ్యాలను తెంచుకుంటున్నాను. నా కోసం మీరు వెతకవద్దు’ అంటూ బయటికి వెళ్లి, చనిపోయే వరకు తిరిగి ఇంటికి వెళ్లకుండా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుడిగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు…
దేశంలో దళితుల గురించి అధ్యయనం చేసి… అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకలను చదివి.. దేశం మొత్తం సైకిల్ మీద తిరిగి దళిత నాయకులు ప్రభుత్వాలకు అణిగి మణిగి ఉంటున్నారని… గ్రహించి పార్టీలనే కాకుండా వాళ్లను కూడా విమర్శించి… అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టిన ఏకైక వ్యక్తి
మాన్యశ్రీ కాన్షీరామ్ గారు అని నియోజకవర్గం అధ్యక్షుడు కోటా శాంసన్ ఈ సందర్భంగా తెలియజేశారు…
ముందుగా నాయకులు ఆయన చిత్రపటానికి
పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు… అనంతరం మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు..
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా స్వేరో అధ్యక్షుడు చేదురి సుబ్బయ్య… గొల్ల శీను.. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..