పొట్టకూటి కోసం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు..

Spread the love

*సాక్షిత : *దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు_..
చిన్నతనంలో తన తండ్రిని కోల్పోయి రెక్క ఆడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కుటుంబ భారం మొత్తం తనపై వేసుకుని,ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ రోజు కూలిగా అతి తక్కువ డబ్బులకి ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని సంరక్షించుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక అభాగ్యురాలి జీవిత గాధ.. ఇంక వివరాల్లోకి వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు గ్రామానికి చెందిన గండేటి దుర్గ(23) అంగవైకల్యంతో బాధపడుతూ తన తల్లి అప్పాయమ్మ కొన్ని సంవత్సరాలుగా మంచం పట్టి ఇంటికే పరిమితం అవడంతో కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం అందిస్తున్న వికలాంగుల పెన్షన్ తో పాటుగా ఇళ్లల్లో పనులు చేసుకుంటూ సొంత గూడు లేక ప్రతి నెల 2000/- రూపాయలు ఇంటి అద్దెలు చెల్లించుకుంటూ అతి కష్టం మీద జీవనం సాగిస్తుంది.

అయితే విధి వెక్కిరించింది అన్నట్లుగా గత కొంతకాలంగా దుర్గకి రక్తహీనతతో పాటుగా టైఫాయిడ్ వ్యాధిసోకి ప్లేట్లెట్స్ అధిక సంఖ్యలో పెరిగిపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇంటిలో బియ్యం గింజ కూడా లేకుండా తల్లి,బిడ్డ సుమారు వారం రోజులుపాటు పోస్తులు ఉంటూ తమ బాధని ఎవరికి విన్నవించుకోవాలో తెలియక ఇంటి వద్ద రోధిస్తూ ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు.సాధారణ ఖర్చులకి కూడా డబ్బులు లేకపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చిన్నపాటి వైద్యంతో ఇంటికి చేరుకున్నారు. అయితే తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ఎవరైనా దయగల దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా వారు ప్రాధేయ పడుతున్నారు.. ఆర్థిక సహాయం అందించే దాతలు ఎవరైనా ఉంటే (టీ.రాజేష్ బాబు) 9866834128 ఈ క్రింది నెంబర్ కి ఫోన్ పే,గూగుల్ పే ద్వారా ఆర్థిక సహాయం అందించవలసిందిగా వారు కోరుచున్నారు.

Related Posts

You cannot copy content of this page