
మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డులో పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన,ప్రారంభోత్సవ శిలా పలకలు ప్రారంభించిన మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..!
సాక్షిత :+మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో దూధిఖాన(వ్యాక్సినేషన్) సెంటర్,అంగన్ వాడీ కేంద్రాలల్లో పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన ప్రారంభోత్సవ శిలా ఫలకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మ రెడ్డి,మేడ్చల్ మున్సిపల్ కమీషనర్ బట్టు నాగిరెడ్డి తో కలిసి పాల్గొన్న మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ.ఈ సందర్భంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ తోటకూర వజ్రేష్(జంగయ్య),మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మ రెడ్డి,మేడ్చల్ మున్సిపల్ కమీషనర్ బట్టు నాగిరెడ్డి సహయ సహకారాలతో ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నానన్నారు.23వ వార్డు పరిధిలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం కృషిచేసినట్లు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలిపారు.
సి.సి.రోడ్లు,బి.టి.రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లు,కరెంట్ స్థంబాలు,త్రీఫేస్ వైర్లు వేయడం,చౌరస్తాలలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేసినట్లు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలియజేసారు.సమస్యలకు పరష్కారం చూపడంలో గొప్ప ఆనందాన్ని పొందగలిగానన్నారు.కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని అనేక ఒడుదొడకులను తట్టుకొని ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం పూర్వజన్మ అదృష్టముగా బావిస్తున్నట్లు పేర్కొన్నారు.23వ వార్డు ప్రజలు నన్ను కౌన్సలర్ గా ఎన్నుకున్నందకు వార్డు ప్రజలకు జన్మ జన్మలు రుణపడి ఉంటానని కౌన్సలర్ కౌడే మహేష్ కురుమ అన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహ్మ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి,మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు సింగిరెడ్డి బాగిరెడ్డి,ఉద్దెమర్రి రాజు ముదిరాజ్,కౌడే రాజు కురుమ,డాక్టర్ సల్మాన్,మేడ్చల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాధాకృష్ణ రెడ్డి,23వ వర్క్ ఇన్స్పెక్టర్ లావణ్య గౌడ్,23వ వార్డు ఆఫీసర్ శ్రీనివాస్,వార్డు జవాన్ నర్సింగ్ రావు,అంగన్ వాడీ టీచర్ ఇందిరా,నర్స్ రజిని,ఆశా వర్కర్లు సునీత మేడ్చల్ పట్టణ పుర ప్రముఖులు,యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
