కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురి శుభకార్యాల ఆహ్వాన పత్రికలు మరియు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించిన స్థానిక మాజీ శాసనసభ్యులు *కూన శ్రీశైలం గౌడ్……
సాక్షిత ::*కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ * షాపూర్ నగర్ లోని వారి నివాసంలో నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ప్రజలు పలు సమస్యలపై కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం మరియు అంతర్గత రోడ్లు, డ్రైనేజీ మరియు మంచి నీటి సరఫరా, కాలనీలలో వీధి దీపాలు ( స్ట్రీట్ లైట్స్ ) వంటి ఇతర సమస్యలపై వారిని కలిసి వినతి పత్రాలను అందించారు..
వారు తక్షణమే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్నిటిని తక్షణమే పరిష్కరించారు…
అదేవిధంగా జగద్గిరిగుట్టకు చెందిన కాంగ్రెస్ నాయకుడు శ్రావణ్ నూతన కారు కొనుగోలు చేసిన సందర్భంగా *మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ * ఆ నూతన కారు ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు…

