వీధి వ్యాపారుల పోట్టకొట్టకండి.
జోనల్ కమిషనర్ కి సిపిఐ వినతి.
99 రోజుల్లో పాలనలో భాగంగా రోడ్డుపైన ఫుట్పాత్ల పైన వ్యాపారం చేసుకుంటున్నటువంటి వీధి వ్యాపారులను తొలగించడం వల్ల వాళ్లు ఉపాధి కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలాంటి ఆలోచనలను విరమించుకొని వాళ్లకు భరోసా ఇవ్వాలని కోరుతూ నేడు కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ తో మాట్లాడుతూ రంగారెడ్డి నగర్ గాంధీనగర్ లలో రోడ్డుకు 10 ఫీట్లకు దూరంలో గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చే గుర్తింపు పొందినటువంటి వీధి వ్యాపారి కార్డును కలిగి వారు తమ జీవితాలను వెళ్ళదీసుకుంటున్నారని వాళ్లపైనే వారి కుటుంబాలు, వాళ్ళ పిల్లల చదువులు అన్ని ఆధారపడి ఉన్నాయి కాబట్టి వారిని తొలగించద్దని కోరడం జరిగింది. వీరి వ్యాపారం వల్ల ప్రజలకు గాని ట్రాఫిక్ గాని ఇలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మానవతా దృక్పథంతో వీళ్లను తొలగించవద్దని అనివార్య పరిస్థితులు ఏర్పడితే వారికి ప్రత్యామ్నాయం చూపించాకే తొలగించాలని కోరారు.
జోనల్ కమిషనర్ పింకీస్ మాట్లాడుతూ వీధి వ్యాపారాలు తొలగించడం తమ ఉద్దేశం కాదని రేపు అక్కడ పర్యటన చేసి తొలగించేలా వద్దా అని నిర్ణయిస్తామని సిపిఐ మరియు వీధి వ్యాపారులకు చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు వీధి వ్యాపారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు జావిద్, యాదగిరి వీధి వ్యాపారులు చాంద్, ఖాన్, మహేష్, శ్రీపతి, జుబేర్,ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY