నగరపాలక సంస్థకు 27 వినతులు
ఇన్ చార్జి కమిషనర్ శారదా దేవి వెల్లడి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 27 వినతులు వచ్చాయని ఇన్ చార్జి కమిషనర్ శారదా దేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 23మంది వినతులు సమర్పించగా, నలుగురు ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. వారిలో తెలుగుగంగ నీరు సక్రమంగా పంపిణీ చేయాలని, లీలా మహల్ కూడలి వద్ద కాలువ కోసం చేసిన గోతులు శుభ్రం చేయాలని, గొల్లవాణిగుంటలో ఆక్రమణలను ఆపాలని, కొర్లగుంట సుభాష్ నగర్లో అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలని, లీలామహల్ సమీపంలో ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిష్కరించాలని, అన్నమయ్య హోటల్ వలన ఇబ్బందిగా ఉంది పరిస్కరించాలని,
దోమలు ఎక్కువగా ఉన్నాయని, బిపిఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఇన్ చార్జి కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు శిల్ప (ఎలక్ట్రీకల్), తులసి కుమార్, గోమతి, తేజస్విని, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY