బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / పుత్తూరు: శ్రీ గాయత్రి కళ్యాణమస్తు, నెల్లూరు వారి ఆధ్వర్యంలో 8వ రాష్ట్ర బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం మే 31వ తేదీన శ్రీ రాధాకృష్ణ ధ్యాన మందిరం, శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం, అష్టలక్ష్మి దేవాలయం, కొండ పాలెం గేట్, నెల్లూరులో ఈ కార్యక్రమంను రాష్ట్ర నాయకులు ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, గాలి శ్రీనివాసరావు, వేదం హరిప్రసాద్, ఉమామహేశ్వరరావు సంయుక్త సమక్షంలో నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయవలసినదిగా పెద్దలు అందరిని రాష్ట్ర, జిల్లా, గాయత్రి కళ్యాణమస్తు కార్యవర్గం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
ఆరోజు ఉదయం 6 గంటలకు శ్రీనివాస కళ్యాణం మహోత్సవం..
ఉదయం: 9.30 గంటలకు వివాహ పరిచయ వేదిక ప్రారంభం
9.30 నుంచి 10.30 గంటల వరకు సభాకార్యక్రమం- విచ్చేసిన అతిథులకు, యంఐసిలకు, ఇతర ప్రముఖులకు కార్యవర్గం తరఫున చిరు సత్కారం.
వివాహ పరిచయ వేదిక పుస్తకం ఆవిష్కరణ. 11గంటల నుండి పరిచయ వేదిక లో వధూవరుల వివాహ పరిచయం కార్యక్రమం… మధ్యాహ్నం 2 గంటల వరకు.
ఈ కార్యక్రమానికి తిరుపతికి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో వేదం హరిప్రసాద్, పుత్తూరుకు చెందిన రాష్ట్ర సెక్రటరీ ఆలూరి రామకృష్ణ, రేణిగుంటకు చెందిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రెడ్డి ప్రకాష్, తిరుపతి నుంచి మహేష్, రాష్ట్ర పురోహిత విభాగం తిరుపతి చెందిన మురళి శర్మ, తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి పుత్తూరు నుంచి బాలాజీ శర్మ, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం గంగాధర్ రావు, లక్ష్మీ రమేష్, తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహచార్య, రాష్ట్ర క్రమశిక్షణ మండలి అధ్యక్షులు కొత్తపల్లి అజయ్ కుమార్, యువజన విభాగానికి సంబంధించిన నాగార్జున, తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. వివాహపరిచయ వేదిక కన్వీనర్ బాలాజీ రావు తెలియజేశారు. కావున బ్రాహ్మణ సంఘాల నాయకులు అందరికీ పేరుపేరునా మరోసారి ఆహ్వానం పలుకుతున్నాము. అని
బాలాజీ రావు
కన్వీనర్, గాయత్రి కళ్యాణమస్తు నెల్లూరు వారు ప్రకటించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY