ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ డిమాండ్.
సాక్షిత : ఆర్టీసీ కార్మికుల రెండో రోజు సమ్మెలో భాగంగా నేడు జీడిమెట్ల డిపో ఎదురుగా జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సిపిఐ మరియు ఏఐటీయుసీ నాయకులు మద్దతు తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేస్తామని, పెండింగ్లో ఉన్న రెండు పీఆర్సీలను ఇస్తామని, యూనియన్ లను పునరుద్ధరిస్తామని తదితర 32 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, గత సంవత్సర కాలంగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి విన్నవిస్తుంటే పట్టించుకోకపోవడం వల్లే నేడు ఆర్టీసీ కార్మికులు అనివార్యంగా సమ్మేళకు వెళ్లాల్సి వచ్చిందని దీన్ని విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వము అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కార్మికులు కష్టనష్టాలను ఓర్చుకొని సమ్మెను విజయవంతం చేస్తున్నారని ఈ సమ్మె ఒక చారిత్రాత్మకంగా మిగిలిపోయేలా కావాలని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దాన్ని కార్మికులపై నెట్టడం అన్యాయమని దాని బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది కాబట్టి వెంటనే చర్చలకు పిలిచి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరియు ఏఐటియుసి ఇతర అనుబంధ సంఘాలన్నీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని వారి ఉద్యమాలలో కూడా రానున్న రోజుల్లో స్వయంగా పాల్గొంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ మండల కార్యదర్శి కే స్వామి, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు,మండల సహాయ కార్యదర్శి హరినాథ్ మాట్లాడుతూ సమ్మె కార్మికులకు కొత్త కాదని ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినప్పటికీ సమ్మె లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారని, సమ్మెను విజయవంతం చేసుకునే బాధ్యత కార్మిక లోకానికి ఉందని వారికి పూర్తిగా సిపిఐ మరియు ఏఐటీయూసీ సహకరిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాస్, జేఏసీ నాయకులు రాజు, ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి డానియల్ నాయకులు గోవర్ధన్ గీత ఖయ్యూం రాజేష్ నారాయణ నాతో పాటు వందలాది మంది ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

