పాలకులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
ఎచ్ ఎమ్ టి ఖాళీ స్థలంలో బస్సు డిపో మరియు ప్రభుత్వం స్పెషలిటీ ఆసుపత్రి ఏర్పాటు చెయ్యాలని కోరుతూ నేడు జగతగిరిగుట్ట సిపిఐ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ రిలే నిరాహార దీక్షలో సిపిఐ రాష్ట్ర సభ్యులు ఏసురత్నం, ఇమామ్ లకు దండలు వేసి దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హెచ్ ఎమ్ టి ఖాళీ స్థలంలో బస్సు డిపో ఆసుపత్రి నిర్మాణం చేస్తామని అప్పటి టి ఆర్ ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ఇక్కడి ఎమ్మెల్యే,కార్పొరేటర్ ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఓట్లు వెయ్యించుకొని గెలిచి ఇప్పుడు వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదని వాటిని సాదించుకోవడం కోసం సిపిఐ గా అనేక సార్లు ధర్నాలు, దీక్షలు,మంత్రి ని కలవడం జరిగిందని ఆసుపత్రి కోసం 25 ఎకరాలు సాధించుకున్నామని, సాధించిన వాటిని కూడా పట్టించుకోక పోవడం దారుణమాని ఇప్పటికైన ప్రజా ప్రతినిధులు సిపిఐ తో కలిసి పోరాటాలు చెయ్యాలని కోరారు.
ఈ నిరాహార దీక్షలకు స్థానికులు తమ మద్దత్తు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండలం కార్యదర్శి స్వామి,సహాయం కార్యదర్శులు హరినాథ్,రాములు,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్,శాఖ కార్యదర్శి సహాదేవ్ రెడ్డి,యువజన సంఘం అధ్యక్షులు సంతోష్,ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ చారీ,సిపిఐ నాయకులు నగేష్ చారీ,బాబు,నారాయణ మేస్త్రి,నర్సీయ్య,మహముద తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
