బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్….
సాక్షిత : కుత్బుల్లాపూర్ *మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ * జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా సూరారం లోని (శివాలయం నగర్)లో ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాలవేసు నివాళులర్పించి వారిని స్మరించుకున్నారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, వారు అనేక పదవులు అనుభవించినప్పటికీ సాధారణ ప్రజల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాల అభివృద్ధికి కొరకు పాటుపడ్డారని కొనియాడారు..
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY