మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్త రఫ్ చేయాలి …
సిపిఎం, సిపిఐ. మండల కార్యదర్శులు కీలుకాని లక్ష్మణ్, ఉమామహేష్ డిమాండ్
మణిపూర్ రాష్ట్రంలో గత 83 రోజులుగా మారణ హోమం జరుగుతున్నదని, వందల మంది ఆదివాసి తెగలు, ఇతర ప్రజలు హత్యలకు గురిచేస్తూ మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెంటనే మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని సిపిఎం. సిపిఐ మండల కార్యదర్శులు కీలుకాని లక్ష్మణ్ ఉమా మహేష్ లు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీ ల పిలుపులో భాగంగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలను వ్యతిరేకిస్తూ మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ జీడిమెట్ల పోస్ట్ ఆఫీస్ నుండి షాపూర్ నగర్ రైతు బజార్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ
మణిపూర్ రాష్ట్రంలో వందలకొద్దీ హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నందున ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రివ్యాఖ్యానించడం ఆ రాష్ట్ర బిజెపి పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. మణిపూర్ రాష్ట్రంలో వందల కొద్ది ఘటనలు జరిగాయని ఆ ఘటనలో అనేకమంది అత్యాచారాలకు గురయ్యారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. ఆదివాసీ మహిళ అయినటువంటి రాష్ట్రపతి, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.గత మూడు నెలల నుండి మణిపూర్ లో మారణ హోమం జరుగుతుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, విదేశాలు తిరగడం చేశారే తప్ప ఆ రాష్ట్రంలో పర్యటించి శాంతిని నెలకొల్పలేక పోయారని విమర్శించారు. ప్రధాని ప్రారంభంలోనే స్పందించి ఉంటే ఇంతటి దారుణాలు వందల కొద్ది మరణాలు, మహిళలపై సామూహిక హత్యాచారాలు జరిగేవి కావని కావన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నెత్తి నోరు మొత్తుకున్న ప్రధాని స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కుకీ గిరిజన తెగకు సంబంధించిన ఒకరిని తల నరికి తడకకు వేలాడదీశారంటే ఆ రాష్ట్రంలో ఎంతటి భయాందోళన వాతావరణం ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా గిరిజన తెగలు, ఇతర ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్న మణిపూర్ రాష్ట్రంలో మారణ హోమం జరగడానికి బిజెపి అనుసరించిన మతోన్మాద రాజకీయాలే కారణమని ఆరోపించారు. దేశ రక్షణ కోసం పని చేసిన ఒక సైనికుడి భార్యని తన కళ్ళముందే బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేయడం భారతమాత సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి అనుసరిస్తున్న విద్వేష, మతోన్మాద విధ్వంసకర విధానాలకు మణిపూర్ మారణ హోమం ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు. సైన్యం, పోలీసుల కళ్ళెదుటే ఇంతటి దారుణాలు జరుగుతుంటే అరికట్టలేని ఆ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి అర్హత లేదని రద్దు చేసిశాంతినినెలకొల్పెందుకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారాలకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దేవదానం జాకీర్ నర్సింహులు తిమ్మప్ప షఫీ సిపిఐ నాయకులు శ్రీనివాస్ వెంకటేష్ రాము సుంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
కీలుకానీ లక్ష్మణ్
మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్త రఫ్ చేయాలి …
Related Posts
డ్రగ్స్ కేసుల్లో ఏ స్థాయి ప్రముఖులున్నా
SAKSHITHA NEWS డ్రగ్స్ కేసుల్లో ఏ స్థాయి ప్రముఖులున్నా ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. సినీ ప్రముఖులు, రాజకీయనాయకులున్నా డ్రగ్స్ ఇతర కేసుల్లో ఎంత పెద్దవారున్నా వదిలేదిలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం హుక్కా సెంటర్లను నిషేధించిందని, కోర్టు అనుమతిలో 12…
శ్రీతేజ్‌ను చూసి రావాలని అల్లు అర్జున్ చెప్పడంతో వచ్చానని వెల్లడి
SAKSHITHA NEWS శ్రీతేజ్‌ను చూసి రావాలని అల్లు అర్జున్ చెప్పడంతో వచ్చానని వెల్లడి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడడానికి సినీ నటుడు అల్లు అర్జున్ ఎందుకు రాలేదో ఆయన తండ్రి,…