SAKSHITHA NEWS

చేవెళ్ల పార్లమెంటు
నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో
ఉన్న బీసీ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని శంకర్‌పల్లి మండల పార్టీ అధ్యక్షుడు కావలి గోపాల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండల పరిధి కొండకల్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి ఓట్లను అడిగారు. అనంతరం కావలి గోపాల్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ ప్రాంతంతో ఎనలేని అనుబంధం ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడం కోసం కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాల్సిన అవసరం ఎంతో ఉన్నదని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా ఎన్నికల
ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు
చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమైందని గోపాల్ ఆరోపించారు. గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండడం లేదని మంచినీటి సమస్య తీవ్రంగా
ఉన్నదని ఇవన్నీ సక్రమంగా ఉండాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారావు, గ్రామ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, ఎంపీటీసీ బద్ధం సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు శ్రీకాంత్, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,
ఏఎంసి డైరెక్టర్ నవీన్ రెడ్డి, ఉప సర్పంచ్ భూపాల్, మండల ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ మర్రివాగు రాజు, నాయకులు గోవర్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రామచంద్రారెడ్డి, మల్లారెడ్డి, చందు, సత్యనారాయణ, రవి, ఆనంద్, లక్ష్మణ్, భాస్కర్ రెడ్డి, లింగం ముదిరాజ్, నర్సింలు, రవీందర్, బి రవి, మల్లేష్, రమేష్, వినయ్ పాల్గొన్నారు.

WhatsApp Image 2024 05 09 at 3.56.37 PM

SAKSHITHA NEWS