అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం అనంతపురం నగరంలోని నందిని హోటల్ వద్ద నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు,అభిమానులు తరలిరాగా భారీ జన సందోహం మధ్య ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ లో తన నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ కార్యక్రమానికి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి,హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ,ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ,మాజీ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు,అనంతపురం జిల్లా జెడ్పీ చైర్మేన్ బోయ గిరిజమ్మ,ఎమ్మెల్సీ మంగమ్మ , అనంతపురం నగర మేయర్ వసీం ,అనంతపురం కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు రాజహంస శ్రీనివాసులు,డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి,వాసంతి సాహిత్య,వైసిపి పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ రాగే పరుశురామ్ ,వైసిపి యువ నాయకుడు బిసి రమేష్ గౌడ్,శంకర నారాయణ సోదరులు మాలగుండ్ల రవీంద్ర,మాలగుండ్ల మల్లికార్జున,శివబాల, లాయర్ పద్మ ముఖ్య అతిధులు పాల్గొనడం జరిగింది. నందిని హోటల్ వద్ద నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో వెళ్లి అనంతపురం కలెక్టర్ ఆఫీస్ లో తన నామినేషన్ దాఖలు చేశారు.కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వై.ఎస్.ఆర్.సి.పి తరఫున అనంతపురం పార్లమెంట్ స్థానానికి మాలగుండ్ల శంకర్ నారాయణ నుంచి నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి మరియు అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ నామినేషన్ పత్రాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాలగుండ్ల శంకర్ నారాయణ
Related Posts
విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !
SAKSHITHA NEWS విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ కార్యకలాపాలు సీఎం చంద్రబాబు తో గూగుల్ ప్రతినిధుల భేటీ గూగుల్ తో ఎంఓయూ చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం SAKSHITHA NEWS