SAKSHITHA NEWS

107 మంది విద్యార్థినులకు స్కాలర్‌షిప్పులు పంపిణీ చేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష,మలబార్ గోల్డ్ & డైమండ్స్ తిరుపతి.
భారత దేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, 30 జనవరి ఉదయం మలబార్ గోల్డ్ & డైమండ్స్ తిరుపతి షోరూంలో, విద్యార్థినులకు స్కాలర్‌షిప్పులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. తిరుపతి నగరం నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు మలబార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో (CSR) భాగంగా ఈ స్కాలర్‌షిప్పులు అందుకున్నారు.
తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయగా, ప్రజాప్రతినిధులు, ఇతర స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు, విద్యార్థులు మరియు మలబార్ గోల్డ్ & డైమండ్స్, తిరుపతి జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్ మరియు స్టోర్ హెడ్ రెజీశ్ మరియు మలబార్ గ్రూపు మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా 107 మందికి పైగా విద్యార్థి దరఖాస్తుదారులు గుర్తించబడ్డారు మరియు ఒక్కొక్కరికి ₹8,000/- నుండి ₹10,000/- చొప్పున స్కాలర్‌షిప్ ₹ 972000/- మొత్తాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 107 మంది విద్యార్థులకు చెక్కులను అందజేయగా, రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,500 మంది పేద విద్యార్థినులను ఎంపిక చేసి రూ 8,000/- నుండి 10,000/- వరకు స్కాలర్‌షిప్పులు అందిస్తామని ఈ సందర్భంగా మలబార్ గ్రూపు ప్రకటించింది.
మలబార్ గ్రూప్ యొక్క నిబద్ధతలో భాగంగా, సామాజిక సేవ కార్యక్రమాలకు, దాతృత్వ కార్యకలాపాలకు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాభాలలో 5% ఈ ప్రాంతంలో ఖర్చుపెడుతుంది. మలబార్ గ్రూపు సామాజిక సేవ కార్యక్రమాల్లో ముఖ్యంగా గృహ నిర్మాణం, వైద్య సహాయం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత మరియు విద్య రంగాల్లో దృష్టి సారిస్తుంది. గత 20 సంవత్సరాలలో మలబార్ గ్రూప్ వారి ‘మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్’ 38.32 కోట్ల రూపాయలకు పైగా వైద్య సహాయంగా వెచ్చించింది, అవసరాల్లో ఉన్న 7.5 లక్షల మందికి తమ సహాయం అందించారు. పేదల గృహనిర్మాణం కోసం 2004లో ‘మలబార్ హౌసింగ్ ఛారిటబుల్ ట్రస్ట్’ స్థాపించబడింది. ఇప్పటి వరకు ఈ ట్రస్ట్ 19,968 పేద కుటుంబాలకు 66 కోట్ల రూపాయలకు మించి నిధులను అందించింది. ‘హోమ్స్ ఫర్ హోమ్‌లెస్’ కార్యక్రమం కింద మలబార్ గ్రూప్ 734 మందికి పైగా వ్యక్తులకు ఇళ్ల నిర్మాణం కోసం ₹3,67,00,000/- ఆర్థిక సహాయం అందించారు.

విభిన్న వ్యాపార సమ్మేళనంతో 1993లో స్థాపించబడిన మలబార్ గ్రూప్ యొక్క ఫ్లాగ్‌షిప్ కంపెనీ మలబార్ గోల్డ్ & డైమండ్స్.

భారతదేశంలోని కేరళలో ప్రధాన కార్యాలయం కలిగియున్న మలబార్ గోల్డ్ & డైమండ్స్, భారతదేశం, మిడిల్ ఈస్ట్ & ఫార్ ఈస్ట్ అంతటా శాఖలతో బంగారం, వజ్రాలు, వెండి మరియు జీవనశైలి ఆభరణాల రంగంలో తమ కార్యకలాపాలకు ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచ వ్యాప్తంగా 300 షోరూములతో 4.51 బిలియన్ డాలర్ల వార్షిక టర్నోవరు కలిగియుంది.

వివిధ రకాల అభిరుచులు గల ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి ప్రస్తుతం 12 ఆభరణాల బ్రాండ్‌లను కలిగి ఉంది మలబార్ గోల్డ్ & డైమండ్స్. నాణ్యమైన ఉత్పత్తులతో, అద్భుతమైన సేవలతో అగ్రపథాన సాగుతున్న మలబార్ గ్రూపు తమ లాభాల్లో 5 శాతాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తుంది.

Whatsapp Image 2024 01 30 At 1.28.58 Pm

SAKSHITHA NEWS