పెన్షన్ పండుగను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిprashanthi reddy
సాక్షిత : – కోవూరు నియోజకవర్గ ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం
- అధికారులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే
జులై 1న పెన్షన్ల పంపిణీ సమర్ధవంతంగా నిర్వహించాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎంపిడిఒలను ఆదేశించారు, నెల్లూరులోని వి.పి.ఆర్. నివాసంలో నియోజకవర్గ పరిధిలోని కోవూరు, బుచ్చిరెడ్డి పాలెం, విడవలూరు, కొడవలూరు, మరియు ఇందుకూరుపేట, ఎంపిడిఒలతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని స్థానిక నాయకుల సహకారంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మండల అధికారులు, సచివాలయ సిబ్బందితో గ్రామాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేసుకొని స్థానిక నాయకుల పర్వేక్షణలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రణాలికా బద్దంగా అమలు చేయాలని కోరారు,చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హెచ్చరించారు. లబ్దిదారుల అవసరాలు దృష్టిలో వుంచుకొని వీలైనంతవరకు ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులను కోరారు,ఈ సమీక్షా సమావేశంలో కోవూరు నియోజకవర్గ పరిధిలో అయిదు మండలాల ఎంపీడీవోలతో పాటు టిడిపి సీనియర్ నాయకులు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు