SAKSHITHA NEWS

ప్రజా సమస్యలపై, కేంద్రంలో ని బీజేపీ హఠావో-దేశ కో బచావో అనే నినాదంతో రేపట్నుంచి ఏప్రిల్ 26 నుండి జరిగే ఇంటిఇంటికి సీపీఐ పేరుతో జరిగే పాదయాత్రలను జయప్రదం చెయ్యాలని కోరుతూ నేడు జగతగిరిగుట్ట సీపీఐ కార్యాలయం వద్ద కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ లు మాట్లాడుతూ రేపట్నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఐ కార్యకర్తలు లక్ష కరపత్రాలను 40 వేల ఇంటికి , లక్ష మంది ప్రజలను కలిసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియచేస్తూ నేడు ప్రజలకు కనీస అవసరాలైన విద్య,వైద్యం,ఉపాధి,గృహ లను అందరికి ఉచితంగా కల్పిస్తే సమసమాజ స్థాపన జరిగి అసమానతలు లేని సమాజము నిర్మించవచ్చని అన్నారు.

కానీ నేటి ప్రభుత్వాలు మతం,కులం పేరుతో అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్నాయే కానీ ప్రజల కనీస అవసరాల పై దృష్టి పెట్టట్లేదని కావున ప్రజలను చైతన్యవంతం చెయ్యడానికి ఈ పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. ఈ పాదయాత్రలకు ప్రతిరోజూ 20 మంది సీపీఐ కార్యకర్తలు పాల్గొని కరపత్రాలను పంచుతూ ప్రజల మనోభావాలను తెలుసుకుంటు రాబోవు రోజుల్లో అవలంబించాల్సిన విధానాల పై కలిసి రూపకల్పన చెలుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావు,సహదేవ్ రెడ్డి,శ్రీనివాస్, పర్వీనా సుల్తానా,మండల నాయకులు ఇమామ్, సుధాకర్,రాజు,నగేష్ చారి, చాంద్, కీర్తి,ప్రసాద్,నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 04 25 at 3.20.21 PM

SAKSHITHA NEWS