SAKSHITHA NEWS

నేను కొడితే మామూలుగా ఉండదు: కెసిఆర్ నోట మహేష్ బాబు డైలాగ్

హైదరాబాద్:
జహీరాబాద్‌ బీఆర్ఎస్‌ నేతల సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గంభీరంగా, మౌనంగా ప్రభుత్వ పాలనను గమనిస్తున్నట్టు తెలిపారు. నేను కొడితే మామూలుగా ఉండదు గట్టిగా కొట్టడం నాకున్న అలవాటంటూ కేసీఆర్‌ హాట్ కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట ముంచుతారని చెప్పినా ప్రజలు మాట వినలేదని.. తులం బంగారం అనగానే నమ్మి ఓట్లేశారని అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని, విమర్శించారు.

మన విజయం తెలంగాణ ప్రజల విజయం రాబోయే రోజుల్లో విజయం మనదే ప్రత్యక్ష పోరాటలకు సిద్ధం కండి, అని పిలుపుని చ్చారు తెలంగాణలో భూముల ధరలు అమాం తం పడిపోతున్నాయి ఎందుకు అని ప్రశ్నించారు.

సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ రాజకీయాల కోసం పుట్టింది కాదు ఇక లాభం లేదు ప్రత్యక్ష పోరాటలు చేద్దామన్నారు.

కాంగ్రెస్ పార్టీ దళిత బందుకు జై భీమ్ చెప్పేశారు తులం బంగారం పథకం గోవిందా! కాంగ్రెస్ పాలనపై అలుపులేని పోరాటం చేద్దామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app