SAKSHITHA NEWS

పార్లమెంట్ సమావేశాలలో భాగంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రచార మాధ్యమాలలో వస్తున్నటువంటి నిరాధార లేక వ్యతిరేక వార్తలకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగానికి గూర్చి నేడు ప్రశ్నించారు. ఒక వ్యక్తి లేదా వ్యక్తులకి సంబంధించి మీడియాలో నిరాధార లేక వ్యతిరేక వార్తలు ప్రచురిస్తే అలాంటిపై ఫిర్యాదును నమోదు చేయడానికి, ఫిర్యాదుల పరిష్కారం కోసం సరైన యంత్రాంగం లేదని కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉందా అలా లేనట్లయితే జిల్లా, రాష్ట్ర, మరియు కేంద్రం అన్ని స్థాయిలలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వ పరిగణలో ఉందా మరియు అన్ని రకాల మాధ్యమాలలో అంతర్గత ఫిర్యాదుల పరిష్కార విధానాలను అందించడాన్ని ప్రభుత్వం పరిగణించిందా అలా అయితే, దాని వివరాలు మరియు కాకపోతే దానికి గల కారణాలు తెలుపగలరు అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించగా అందుకు సమాధానంగా సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ వివిధ మాధ్యమాలలో ప్రచురితమవుతున్న సమాచారానికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం సంస్థాగత యంత్రాంగాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రింట్ మీడియా కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) ప్రెస్ కౌన్సిల్ చట్టం 1978 ద్వారా ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ అని జర్నలిస్టిక్ ప్రవర్తనా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించడానికి సెక్షన్ 14 కింద ఫిర్యాదు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయబడింది అని తెలియజేసారు. ఈ చట్ట ప్రకారం నిర్దిష్ట పరిస్థితులలో ఏ వ్యక్తి పైనైనా స్పష్టంగా పరువు నష్టం కలిగించే లేదా అవమానకరమైన కథనాలు వార్తాపత్రికలు ప్రచురించకూడదని తెలియజేసారు. అలాగే డిజిటల్ మీడియా మరియు ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెల్లలో వార్తల ప్రసారానికి సంబంధించి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (నియంత్రణ) చట్టం, 1995 ప్రకారం, నిర్దేశించిన నియమావళిని ఉల్లంఘించినట్లయితే అందుకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించడానికి ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కారానికి మూడు అంచెల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని. చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించిన చోట తగిన చర్యలు తీసుకోబడతాయి అని తెలియజేసారు.


SAKSHITHA NEWS