దెందులూరులో సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ… తన పాలన చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డ జగన్ హయాంలో జరుగుతున్న ఈ 57 నెలల పాలనకు, గతంలో చంద్రబాబు పాలనకు తేడా చూడాలని అన్నారు. ఎవరి పాలనలో ప్రజల ఖాతాల్లోకి ఎక్కువ డబ్బు పడిందో వైసీపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి అడగాలని సూచించారు.
అక్కచెల్లెమ్మల ఖాతాలో చంద్రబాబు ఒక్క రూపాయి అయినా వేశాడా?చంద్రబాబు మేనిఫెస్టోలో 10 శాతం అయినా హామీలు నెరవేర్చాడా? అని సీఎం జగన్ ప్రశ్నించారు.
“కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు… మీ ఇష్టం వచ్చిన ఏ గ్రామం అయినా తీసుకోండి… ఏ పట్టణం అయినా తీసుకోండి… గతంలో లేని విధంగా ఇవాళ ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది, ఒక వార్డు సచివాలయం కనిపిస్తుంది. ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అంటే… మీ జగన్, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..