హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్, బృందావనం కాలనీ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ కేసీఆర్ ని గుర్తు పెట్టుకొని కారు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేసేది బీఆర్ఎస్ అని అన్నారు. ఆరు గ్యారెంటీలంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమల్లో విఫలమైందని, ఇంటింటికీ వెళ్లి.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు సూచించారు. ఓట్లు అడిగేందుకు వచ్చే ఆపార్టీ నేతలను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి సమస్య, కరెంటు కష్టాలు మొదలయ్యాయని అన్నారు.
సంక్షేమ పథకాల అమల్లో బీఆర్ఎస్ ది ఒక చరిత్ర అని, దానిని ఎవరూ చెరిపేయ లేరని అన్నారు. కలిసి కట్టుగా పనిచేస్తే చేవెళ్ల ఎంపీ స్థానం బీఆర్ఎస్ దే అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చిన ఘనత కేసీఆర్ సర్కారు దే అని అన్నారు. అన్నివర్గాల ప్రజలను అక్కున చేర్చుకొని…గొప్పగొప్ప సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ అని ఈ సందర్బంగా తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు,శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
Sakshitha News
Download app
https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app
Sakshitha Epaper
Download ap