- సాక్షిత ఖమ్మం : పొంగులేటి ఇంట మరో వివాహ వేడుక
- ఈనెల 18న ప్రసాద్ రెడ్డి తనయుని రిసెప్షన్ మహెూత్సవం
*- కల్లూరు నారాయణపురంలో భారీ సెట్టింగ్ తో ఏర్పాట్లు ముమ్మరం
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట మరో వివాహ వేడుకకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తనయుడు లోహిత్ రెడ్డి వివాహాం ఈనెల 14న దుబాయ్ లో జరగనుంది. వివాహానంతరం రిసెప్షన్ వేడుకను ఈనెల 18న కల్లూరు నారాయణపురంలో నిర్వహించేందుకు భారీ సెట్టింగ్ తో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, ఎస్ఆర్ హెూమ్స్ అధినేత శ్రీనివాస రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పొంగులేటి అభిమానులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రజానీకం తరలొచ్చే అవకాశం ఉన్నందుకు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి, తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోరుతున్నారు.
రారండోయ్ వేడుక చూద్దాం..!
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…