SAKSHITHA NEWS

సాక్షిత : సామాజిక చైతన్యాన్ని కలిగించిన గొప్ప వ్యక్తి…

స్త్రీలు విద్యావంతులు కావలని కృషి చేసిన మహనీయుడు : కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు పిలుపునిచ్చారు. స్త్రీలు విద్యావంతులు కావాలని పాఠశాలలను పెట్టి విద్య నేర్పిన మహనీయుడని అన్నారు.
మహత్మ జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్ లో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుల వ్యవస్థలో లోపాలను గుర్తించి ఆనాడే సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు. మహిళలు చదువుతో కుటుంబం అభివృద్ధి చెందుతుందని ఆలోచించి జ్యోతిబాపూలే మహిళల చదువు కోసం స్వయంగా పాఠశాలలను ఏర్పాటు చేసి మహిళలకు చదువు నేర్పించాడని తెలిపారు.

అణగారిన వర్గాల వారికి సమాన హక్కులు, అట్టడుగు జాతుల విద్యాభివృద్ధి కోసం ఫూలే కృషి చేశారన్నారు. సమాజంలో అసమానతలను నిర్మూలించేందుకు అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. సత్యశోధక్‌ అనే సంస్థను స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. అంటరానితనం, నిరక్షరాస్యత, కుల వివక్షపై శతాబ్దం కిత్రమే ఫూలే ఉద్యమాలు నిర్వహించారన్నారు. సాంఘిక సమానత్వం కోసం కృషి చేశారన్నారు. మనిషిని మనిషిగా గౌరవించాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని నమ్మిన గొప్ప వ్యక్తి ఫూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి మధుసూదన్ రాజ, జడ్పీ సీఈవో వివి అప్పారావు, డిఎస్ఓ మోహన్ బాబు, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, మైనార్టీ వెల్ఫేర్ అధికారి జగదీష్ రెడ్డి, జడ్పీ సీఈవో కిషన్ ,తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ జనరల్ సెక్రెటరీ దున్న శ్యామ్, కలెక్టరేట్ ఏవో మధుసూదన్ రెడ్డి ఆర్డిఓ వేణుమాధవ్, తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి ,డిఎల్పిఓ ఎస్తేర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS