SAKSHITHA NEWS

పామాయిల్‌ రైతులకు నష్టం రానివ్వం.
ఆయిల్ పామ్ రైతులకు ప్రోత్సాహం లో భాగమే
హబ్‌గా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా
తెలంగాణ రాష్ట్రం లో ఫామయిల్ సాగు రైతులకు ఎటువంటి నష్టం రానివ్వమని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు..
పలు పత్రికలలో నూనె దిగుబడి ,రవాణా పలు విషయాలలో అనుమానాలు తలెత్తే విధంగా కథనాలపై చైర్మన్ రాఘవ రెడ్డి వివరణ ఇచ్చారు.

ఆయిల్ ఫామ్ సాగులో ఇప్పటికే దశాబ్దాలుగా అనుభవం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు అవగాహన ఉందని అన్నారు.

వరంగల్ ,కరీంనగర్, మహబూబ్ నగర్ ,మెదక్ జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ఇతర ప్రాంతాల రైతులకు ఇచ్చే సదుపాయాలు కల్పిస్తుందని వల్ల చైర్మైన్ జంగా రాఘవ రెడ్డి అన్నారు.

ఈ జిల్లాలోని ఆయిల్ పామ్ గెలలను ప్రాసెసింగ్ చేయడానికి ప్రస్తుతం రాష్ట్రంలో అశ్వారావుపేట ,అప్పారావు పేట మిల్ లే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికే డిమాండ్ కు అనుగుణంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆయిల్ పామ్ ఫ్రాసెసింగ్ మిల్లు ను నిర్మిస్తున్నారని త్వరలోనే అందుబాటులో కి రానుందని పేర్కొన్నారు.

తొర్రురు.. మరియు ఇంకొ నాలుగు ప్రాంతాల్లో ప్రాసెసింగ్ మిల్ ల ను ఏర్పాటుకు కృషి చేస్తున్నమన్నారు.

ఇతర జిల్లాల నుంచి వచ్చే నూతన ఆయిల్ పామ్ గెలాల వల్ల అశ్వారావుపేట మిల్ లో ప్రాసెసింగ్ జరుగుతుందని ఇది ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఆయిల్ పామ్ సాగు రైతుల పై ప్రభావం చూపదని అన్నారు.

ఈ విషయం లో రైతులు ఎటువంటి అనుమానాలు..అపోహలకు పోవద్దని అన్నారు.

రైతు ను రాజు చేసేందుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ఇంకో రైతు ను నష్టం చేయడానికి కాదని ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి అన్నారు.
పత్రికలలో వస్తున్నట్లు ఏదో ప్రయివేటు కంపెనీల కు లాభం చేకూర్చే ఉద్దేశ్యం మా ప్రభుత్వం కు లేదన్నారు..
స్వయంగా రైతు బిడ్డ నైన తాను ఎట్టి పరిస్థితి లో ఆయిల్ పామ్ రైతాంగానికి నష్టం రానివ్వని భరోసా ఇచ్చారు.


SAKSHITHA NEWS