మహిళల్ని ఓడించిన డీఎంకేని ఓడిద్దాం
** డబులింజన్ సర్కార్ తోనే తమిళనాడు అభివృద్ధి
** రెండోరోజు తమిళనాడు ప్రచారంలో చంద్రబాబు నాయుడు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / మధురై: డీఎంకే పాలనలో తమిళనాడు అభివృద్ధి కుంటుపడింది… మహిళల్ని అన్నివిధాలా ఓడించిన ఆ పార్టీని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రెండోరోజు చంద్రబాబు మధురై పరిసర నియోజకవర్గంలలో పర్యటించారు. పారిశ్రామికవేత్తలు, మేధావులు, విద్యావంతులు, రాజకీయ సీనియర్లతో సమావేశం నిర్వహించి ఎన్డీఏ అభ్యర్థుల గెలుపుపై దిశానిర్దేశం చేశారు. డబులింజన్ సర్కార్ తోనే తమిళనాడు అభివృద్ధి సాధ్యం అని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి వల్లే అభివృద్ధి పరుగులు పెడుతోందని గుర్తు చేశారు. అందులో భాగమే వేలాది చిన్నారుల జీవితాల్లో ఆశాదీపం వెలిగించేందుకు కేంద్రం, గ్లోబల్ సంస్థలు, దేశీయ కంపెనీలతో సమన్వయం చేస్తూ” ప్రాజెక్ట్ పునర్విక ప్రణాళిక ” కు శ్రీకారం చుట్టిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అని పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY