మహబూబాబాద్ జిల్లా:
డోర్నకల్ కు చెందిన న్యాయవాది తేజావత్ రమేష్ కు ఫోక్సో కేసులో ఐదు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష ను మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ తీర్పునిచ్చినట్లు ఫోక్సాకోర్టు పి పి కీసర పద్మాకర్ రెడ్డి తెలిపారు డోర్నకల్ ఎస్సీ బీసీ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికపై గత సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన తేజావత్ రమేష్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్ బాలిక తల్లి డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు సిఐ ఉపేందర్ ఎస్సై ఝాన్సీలు తేజావత్ రమేష్ పై కేసు నమోదు చేశారు మానుకోట జిల్లా కోర్టులో కేసు దాఖలు చేయగా ఫోక్సో పిపి కీసర పద్మకర్ రెడ్డి వాదనలు వినిపించడంతో కేసు నమోదు చేసిన ప్రధాన న్యాయమూర్తి తేజావత్ రమేష్ కు ఐదు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష 11 వేల రూపాయల జరిమానా ను విధించినట్లు ఫోక్సో పి పి కీసర పద్మాకర్ రెడ్డి తెలిపారు