లడ్డు వేలం పాట రూ. 2 లక్షల 22 వేల 222 నగదును అందజేసిన బిజెపి మున్సిపల్ ఇంచార్జ్ వాసుదేవ్ కన్నా, మన సంస్కృతి రెస్టారెంట్ యజమాని నరసింహారెడ్డి
సాక్షిత శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి 13, 14 వార్డులలో వివేకానంద యువజన సంఘం ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గత సంవత్సరం 2023లో వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో మొదటి లడ్డూను రూ. 2 లక్షల 22 వేల 222 లకు బిజెపి మున్సిపల్ ఇంచార్జ్ వాసుదేవ్ కన్నా, మన సంస్కృతి రెస్టారెంట్ యజమాని నరసింహారెడ్డిలు కలిసి లడ్డును కైవసం చేసుకున్నారు. రెండవ లడ్డును రిపోర్టర్ రాజశేఖర్ లక్ష 11 వేల 111 లకు కైవసం చేసుకున్నారు. మంగళవారం వినాయక నిమజ్జనం రోజున యువజన సంఘం సభ్యులకు వారు నగదును అందజేశారు. యువజన సంఘం సభ్యులు నగదును అందజేసిన వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాసుదేవ్ కన్నా మాట్లాడుతూ హిందూ సాంప్రదాయ పరంగా ప్రజలంతా ఒకచోట కలిసి జరుపుకునే పండగ వినాయక చవితి అని, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచే గణనాథునికి చల్లని ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని అన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో, పాడిపంటలతో ఉండాలని కోరుకున్నారు.