SAKSHITHA NEWS

Lack of sanitation is the curse of rural milk!

పారిశుద్ధ్య లోపం గ్రామీణల పాలిట శాపం!
సాక్షిత నంద్యాల జిల్లా

చోద్యం చూస్తున్న పంచాయతీ అధికారులు
గడపగడప కార్యక్రమంతో ఒరిగిందేమిటి
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలుఅని సామెత మాత్రమే

గ్రామాలు దేశానికి పట్టు కొమ్మలు అన్నారు. అయితే ఆచరణలో అందుకు భిన్నంగా దర్శనమిస్తోంది. ఆగ్రామంలో అడుగడుగునా మురుగు నీరు తాండవిస్తోంది. అయినా అధికారులు, నాయకులకు చీమకుట్టినట్లైన లేదని గ్రామీణులు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే, నియోజకవర్గ పరిధిలోని ప్యాపిలి మండలం మునిమడుగు పంచాయతీలోని మజారా గ్రామమైనఆలేబాద్ గ్రామంలోప్రజలు దాహం తీర్చే మంచి నీటి ట్యాంక్ దగ్గర శుభ్రత పాటించడం లేదు

,ప్రధాన వీధుల్లో పారిశు ర్థ్యం లోపించింది విపరీతమైన దోమలు వృద్ధి చెంది పలువురు జ్వరాల బారిన పడాల్సి వస్తోందని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు పారిశుద్ధ్య మెరుగు చర్యల విషయంలో గ్రామ కార్యదర్శి,విస్తీర్ణాధికారి చోద్యం చూస్తున్నారని గ్రామీణులు ధ్వజమెత్తారు ఎంతో ప్రచారర్భతంగా గడపగడప కార్యక్రమాన్ని నాయకులు నిర్వహించడం జరుగుతుంది.అయితే అధికారులు,

నాయకులు పని ఆర్భాటం చూపటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛభారత్ అనే దంపుడు ఉపన్యాసాలు ప్రకటనలు తరచూ గుర్తిస్తున్నారని క్షేత్రస్థాయిలో వాటికి ఎక్కడా పొంతనలేదని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేశారు మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛత, శుభ్రత కరువైందని సంబంధిత అధికారులకు కనీసం చీమకుట్టినట్లైనా లేదని వారు తూర్పారబట్టారు తాగునీటి విషయంలో ఎప్పటికప్పుడు ట్యాంకులను శుభ్రం చేయడం లేదన్నారు అలాగే వ్యాధులు ప్రబలకుండా క్లోరినేషన్,శానిటేషన్ చేయటం లేదని వారు విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ శానిటేషన్ సమస్యలు చేయగలరని ప్రజలు కోరుతున్నారు.

ప్రతి పంచాయతీకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి వారికి ఏటువంటి అవగాహన కల్పించకుండా వారు గ్రామాలలో ఏమి చేయాలో చెప్పకుండా ఉద్యోగాలు ఇస్తే ఇలానే ఉంటుందనితెలిపారు.సిబ్బంది ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెలుతారో వారికే ఎరుక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది నిరుద్యోగులుగా ఉన్న వారిని గుర్తించి సచివాలయ ఉద్యోగులుగా నియమిస్తే వాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా విధులు నిర్వహిస్తున్నారు.

సచివాలయాలు ఉన్న ఫలితం లేకుండా పోయింది. ప్రజల సచివాలయంకు వెళితే మా గోడు పట్టించుకోకుండా మీరు ఎందుకు వచ్చారు అని అడగకుండా, కూర్చోండి అని కూడాఅనకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు అని గ్రామ ప్రజలు తెలిపారు. సచివాలయ సిబ్బందిపై ఏమైనా ఫిర్యాదు చేస్తే మాకు అందాల్సిన పథకాలు ఎక్కడ నిలుపుదల చేస్తారో అని ఏమి చెప్పలేక మా బాధలు ఎవరికి వినిపించలేక మాటలు రాని వారి మాదిరి ఉండవలసి వచ్చిందని గ్రామ ప్రజలు అంటున్నారు.


SAKSHITHA NEWS