SAKSHITHA NEWS

కర్నూలు(ఓర్వకల్లు) ఎయిర్ పోర్ట్ లో ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం

కర్నూలు, అక్టోబర్ 17:నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ నాలుగో ఏడాది రెండో విడత నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ఉదయం 10.10 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు..ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.

కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, డా.జె.సుధాకర్, కంగాటి శ్రీదేవి, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, , జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ, సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, , ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ విద్యా సాగర్, వక్ఫ్ బోర్డు సి ఈ వో అబ్దుల్ ఖాదర్ తదితరులు ముఖ్యమంత్రికి పుష్ప గుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు

అనంతరం ముఖ్యమంత్రి కర్నూలు (ఓర్వకల్లు) ఎయిర్ పోర్ట్ నుండి ఉదయం 10.28 గంటలకు ఆళ్ళగడ్డకు బయలుదేరి వెళ్లారు

*నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ నాలుగో ఏడాది రెండో విడత నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుండి కర్నూలు (ఓర్వకల్లు) ఎయిర్ పోర్ట్ కుమధ్యాహ్నం 2.10 గంటలకు చేరుకుని, 2.15 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు బయలుదేరి వెళ్ళారు..ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, డా.జె.సుధాకర్, కంగాటి శ్రీదేవి, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ విద్యా సాగర్ తదితరులు ముఖ్యమంత్రికి సాదరంగా వీడ్కోలు పలికారు..


SAKSHITHA NEWS