SAKSHITHA NEWS

Kurnool District Sarpanch Awareness Conference

కర్నూలు జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు .

ఉమ్మడి కర్నూలు జిల్లా, కర్నూలు టౌన్ లో ఏర్పాటుచేసిన సర్పంచుల అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని సర్పంచుల సమస్యల పట్ల ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ .

ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…

మమ్ములను నమ్మి మాకు ఓటేసిన మా గ్రామాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం, మహాత్మా గాంధీ కలలుగన్న “గ్రామ స్వరాజ్య” సాధన కోసం మేము కోరుతున్న డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే మా న్యాయబద్ధమైన 12 డిమాండ్ల సాధన కోసం, మమ్ములను గెలిపించిన మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలోని 12918 మంది సర్పంచులు లో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు పార్టీలకతీతంగా ఐక్యమై ఉద్యమిస్తామని, రాజీలేని పోరాటాలు చేస్తామని మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మని రాజేంద్రప్రసాద్ అన్నారు.

అదేవిధంగా వైయస్సార్ సిపి ఎమ్మెల్యేల సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఇచ్చిన 20 లక్షల నిధులను గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని…

మా గ్రామ పంచాయతీలకు ఇవ్వవలసిన 7660 కోట్ల ఆర్థిక సంఘం నిధులను దారి మళ్ళించి దొడ్డిదారిన గ్రామ సచివాలయాల ద్వారా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలకు ఇచ్చి గ్రామాల్లో, పట్టణాల్లో వారితో పనులు చేయించి రాజకీయ అనుచిత లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సిగ్గుచేటైన విషయం అని….

సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు చేయవలసిన పనులను ఎమ్మెల్యేల చేత, వాలంటీర్ల చేత చేయించాలని ముఖ్యమంత్రి

ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరు 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలకు వ్యతిరేకం, అనైతికం అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

అలాగే సచివాలయాలకు చేయూత అని ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల రూపాయలను విడుదల చేయవలసిందిగా జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసి ఆ నిధులతో ఆ ప్రాంతంలో పనులు చేసుకోమని ఎమ్మెల్యేలకు చెప్పడం దారుణ మనీ, ఆ నిధులను సచివాలయాలకు, ఎమ్మెల్యేలకు, వాలంటీర్లకు కాకుండా గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఇచ్చి సర్పంచుల, ఎంపీటీసీలు, కౌన్సిలర్ లు, కార్పొరేటర్ల చేతనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చేయించవలసిన దిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామని…

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు మరియు సర్పంచ్లు, ఎంపీటీసీలు,కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పట్ల చిన్నచూపు చూస్తూ, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తున్నారు. ఇది 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలకు వ్యతిరేకం అని…ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీ లను నిర్వీర్యం చేసి, సర్పంచులను, ఎంపీటీసీ లను, కౌన్సిలర్ల ను, కార్పొరేటర్లను ఉత్సవ విగ్రహాలు లాగా మారుస్తోందని…

అసలు ప్రజలకు కావాల్సిన రోడ్లు,డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్ మొదలగునవి కల్పించవలసినటువంటి బాధ్యత రాజ్యాంగం ప్రకారం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల దే తప్ప- చట్ట ప్రకారం గ్రామ సచివాలయ లకు, వాలంటీర్లకు, ఎమ్మెల్యేలకు ఎటువంటి సంబంధం లేదని…..రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు పోటీగా సమాంతర సచివాలయ వ్యవస్థ ను, వాలంటీర్లను ఏర్పాటుచేసి మా స్థానిక ప్రభుత్వాల నిధులు,విధులు, అధికారాలను హైజాక్ చేసి సచివాలయాలకు కట్టబెడుతున్నార నీ, ఇది చూస్తూ మేము సహించేది లేదని…
గ్రామ సచివాలయాలకు విడుదల చేసిన నిధులతో పాటు, కేంద్ర ప్రభుత్వం 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు పంపించిన 7660 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకున్నదని కనుక ఆ రూ,,7660 కోట్లను కూడా మా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు , నంద్యాల జిల్లా తెదేపా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి , ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు బిర్రు ప్రతాప్ రెడ్డి, కె. శ్రీనివాస్ యాదవ్, మీనాక్షి నాయుడు, యేజర్ల వినోద్ రాజు, సింగంశెట్టి సుబ్బరామయ్య, ముల్లంగి రామకృష్ణారెడ్డి, కొత్తపు ముని రెడ్డి, చుక్క ధనుంజయ్ యాదవ్, అనేపు రామకృష్ణ నాయుడు, బోర్ర నాగరాజు, వానపల్లి ముత్యాలరావు, వీరేష్, లాయర్ ప్రతాప్ నాయుడు తదితరులు పాల్గొని ప్రసంగించారు.


SAKSHITHA NEWS