సొంత పార్టీలో కుంపటి
వికారాబాద్ మోమిన్ పేట్ మరియు వికారాబాద్ స్థానిక టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆటంకం కలిగింది. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని నాగేష్ గుప్తా గార్డెన్ లో కార్యక్రమం జరుగుతుండగా ఎమ్మెల్యే ఆనంద్ జిందాబాద్ అంటూ సొంత పార్టీ కి చెందిన నాయకులు జరుగుతున్న కార్యక్రమానికి అడ్డు తగిలారు. పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉండి ఇలా కొంతమంది వర్గీయులను పంపించి కార్యక్రమాన్ని కాక వికలం చేయడం ఏమిటని, పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయం పరచాల్సిన ఎమ్మెల్యే ఆనంద్ ఇలా ప్రజాస్వామికంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. జరిగిన సంఘటనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పార్టీ నాయకులు వడ్ల నందు, నాగేందర్ గౌడ్, చిగుళ్లపల్లి రమేష్ కుమార్, హనుమంత్ రెడ్డి, రామచంద్రారెడ్డి రామేశ్వర్, తదితరులు కలిసి మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే ఆనంద్ వైఖరిపై నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషిచేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఆనంద్ ను గెలిపిస్తే గెలిపించిన వారిపైనే కక్ష సాధింపు చర్యలు చేపడుతూ.. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ అట్రాసిటీ కేసులు నమోదు చేయించి తన వక్రబుద్ధిని బయట పెట్టుకున్నాడని దుయ్యబట్టారు. దీనికి తోడు పోలీసులు సైతం తాము తింటున్న ప్లేట్లను లాక్కొని బయటికి పంపడం సరికాదన్నారు. ఎమ్మెల్యే వైఖరి వల్ల వికారాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే తీరని నష్టం వాటిల్లిందన్నారు. కెసిఆర్ కేటీఆర్ దయవల్ల ఎమ్మెల్యే టికెట్ లభిస్తే తామంతా కష్టపడి గెలిపించామని కానీ దానిని నిలబెట్టుకోవడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో మర్పల్లి, మోమిన్ పేట , స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.