SAKSHITHA NEWS

వేరే రాష్ట్రాలలో సెక్రేరియట్‌లు.. కనీసం మన జిల్లా కలెక్టర్ కార్యాలయాల మాదిరి కూడా లేవని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
వేరే రాష్ట్రాలలో సెక్రేరియట్‌లు.. కనీసం మన జిల్లా కలెక్టర్ కార్యాలయాల మాదిరి కూడా లేవని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో భౌగోళికంగా 11 పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 12వ రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దేశానికి ఆర్థిక చేయూతను అందించడంలో తెలంగాణ 4వ రాష్ట్రమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 10 వ స్థానంలో కూడా లేదని కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలవడం గర్వకారణమన్నారు. ఐటీ, అగ్రికల్చర్‌లో అగ్ర భాగంలో నిలిచామన్నారు. పల్లె ప్రగతిలో దేశంలో 30 శాతం అవార్డులు తెలంగాణ గెలుచుకోవడం గర్వకారణమన్నారు. 12 గంటల కు కోడ్ వస్తుందని.. తనకు మాత్రం ఎలాంటి ఆతృత లేదన్నారు. ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తున్నామని కేటీఆర్ అన్నారు…


SAKSHITHA NEWS