SAKSHITHA NEWS

పాదయాత్ర చేస్తున్న స్నేక్ సొసైటీ కృష్ణ సాగర్ బృందానికి స్వాగతం పలికిన……బిజెపి

సాక్షిత వనపర్తి జూన్ 25
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదంతో వనపర్తి జిల్లాకు చెందిన స్నేక్ సొసైటీ అధ్యక్షులు కృష్ణ సాగర్ బృందం ఆధ్వర్యంలో ఈనెల 22న జోగులాంబ అలంపూర్ నుండి చెట్లను నాటి చెట్లను కాపాడండి రక్షించండన నినాదంతో అలంపూర్ నుండి హైదరాబాదు వరకు పాదయాత్ర చేస్తూ చెట్లను నాటే బృహత్తర కార్యక్రమాన్ని కి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా బుధవారం వనపర్తి పట్టణానికి చేరుకున్న కృష్ణ సాగర్ పాదయాత్ర బృందాన్ని కి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురామ ఆధ్వర్యంలో వారికి శాలువా కప్పి స్వాగతం పలికారు అందులో భాగంగా పట్టణంలోని మరి కుంట వద్ద ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ , వనపర్తి పోలీస్ స్టేషన్లో ఎస్సై జలంధర్ రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు పాలిటెక్నిక్ కళాశాల ముందు చత్రపతి శివాజీ విగ్రహం వద్ద బిజెపి కార్యాలయం తోపాటు పలు ప్రాంతాలలో మొక్కలను నాటడం జరిగింది బిజెపి నాయకుల తోపాటు పలువురు మాట్లాడుతూ వృక్షో రక్షితి రక్షితః అన్న నినాదంతో స్నేక్ సొసైటీ అధ్యక్షులు కృష్ణసాగర్ ఆధ్వర్యంలో అల్లంపూర్ టు హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రశాంతంగా విజయవంతం గా కొనసాగాలని ఆకాంక్షిస్తూ చివరగా అయ్యప్ప గుడి నుండి వారిని సాగనంపడం జరిగింది ఈ కార్యక్రమంలో గోనూరు యాదగిరి జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి విజయ సాగర్ సోషల్ మీడియా కన్వీనర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

పాదయాత్ర చేస్తున్న స్నేక్ సొసైటీ కృష్ణ సాగర్

SAKSHITHA NEWS