SAKSHITHA NEWS

అరుణ వర్ణమైన కొత్తగూడెం

  • నేడు సిపిఐ ప్రజాగర్జన – హాజరుకానున్న రాజా నారాయణ పువ్వాడ తదితరులు
  • కదలిరానున్న ఎర్రదండు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కొత్తగూడెం పట్టణం అరుణ వర్ణాన్ని పొలముకుంది. ఎటు చూసినా ఎర్రజెండాల రెపరెపలే కనిపిస్తున్నాయి భారీ ఫ్లెక్సీలు తోరణాలు కటౌట్లతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ ఆదివారం ప్రజా గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు లక్ష మంది సమీకరణ లక్ష్యంగా సాగుతున్న సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెలరోజులపాటు విస్తృత ప్రచారం నిర్వహించారు కొత్తగూడెం ప్రధాన కోణాలను జెండాలు తోరణాలతో తీర్చిదిద్దారు ప్రకాశం స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి వచ్చే వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రజా గర్జన సభకు ప్రత్యేక రైలు ద్వారా సిపిఐ కార్యకర్తలు తరలిరానున్నారు సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాల నుండి వేలాదిగా కార్మికులు తరలివచ్చేందుకు ప్రత్యక్ష ఏర్పాట్లు చేశారు . పోడు ప్రభావిత ప్రాంతాల నుండి పోడు రైతులు పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు హాజరుకానున్నారు సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులతో ఇప్పటికే సిపిఐ నేతలు సభలు సమావేశాలు నిర్వహించి ప్రజా గర్జన సభ ఆవశ్యకతను వివరించారు బహిరంగ సభకు సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రధానంగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ గ్రామాన సభలు సమావేశాలు జరిపి కొత్తగూడెం సభకు ప్రజలు భారీగా తరలివచ్చే విధంగా వాహనాలు ఏర్పాటు చేశారు ఒక కొత్తగూడెం నియోజకవర్గం నుండి 25వేల కు పైగా ప్రజలను కదిలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు భద్రాచలం తినపాక ఇల్లందు అశ్వరావుపేట నియోజకవర్గాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరన్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి దాదాపు వెయ్యి వాహనాలను బహిరంగ సభ కోసం ఏర్పాటు చేయగా మరో వందకు పైగా ప్రైవేటు వాహనాల ద్వారా కార్యకర్తలు తరలివచ్చేందుకు ఏర్పాటు చేశారు పార్టీకి బలమైన పునాది ఉన్న నల్గొండ వరంగల్ జిల్లాల నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు జన సమీకరణలో భాగంగా గడిచిన నెల రోజులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమ్మెని సాంబశివరావు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గం తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ గ్రామాన పర్యటన చేసి ప్రజా గర్జన సభ ఆవశ్యకతను వివరించి సభ జయప్రదానికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్ ఎస్ కే సాబీర్ బాషా బి అయోధ్య రావులపల్లి రాంప్రసాద్ మహమ్మద్ మౌలానా దండి సురేష్ తో పాటు ఆయా జిల్లాల రాష్ట్ర సమితి సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు ప్రజాగర్జన ప్రచారంలో భాగంగా అన్ని మండలాల్లోనూ సమావేశాలు నియోజకవర్గం స్థాయిలో సదస్సులు నిర్వహించారు.
హాజరుకానున్న డి రాజా -భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చాలా కాలం తర్వాత కొత్తగూడెం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు ఈ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ సభకు జాతీయ కార్యదర్శి డి రాజా తో పాటు సిపిఐ జాతీయ నాయకులు కే నారాయణ హాజీజ్ పాషా చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనన్నేని సాంబశివరావు సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి వాసిరెడ్డి సీతారామయ్య ప్రముఖ వాదయకారులు గోరేటి వెంకన్న వందేమాతరం శ్రీనివాస్ రావు మిమిక్రీ రమేష్ తో పాటు తదితరులు హాజరుకానున్నారు


SAKSHITHA NEWS