రంగారెడ్డి నగర్ 127 డివిజన్: వెంకట్రామిరెడ్డి నగర్ రామమందిర్ లో జై జగన్నాథ పూజ అసోసియేషన్ గాంధీనగర్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన హరే రామ హరే కృష్ణ సంకీర్తన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒరిస్సా సమాజ్ పెద్దలు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేశారు. ఈ ఏడాది తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసి కేసీఆర్ అరాచక పాలన నుండి ప్రజలకు విముక్తి కలుగుతుందని అన్నారు. అంతకుముందు షాపూర్ చౌరస్తా లో హిందూవాహిని ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రమేష్, రాజ్ కుమార్, దీపక్, చోటు స్థానిక బిజెపి నాయకులు,బుచ్చిరెడ్డి, మోతె శ్రీనివాస్, రమేష్ మంజుల్కర్, ఏర్వ వెంకట్, రాంచంధర్ రావ్, నవీన్ రెడ్డి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు
Related Posts
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..
SAKSHITHA NEWS ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..రింగ్స్ మార్చుకున్న పీవీ సింధు, వెంకటదత్తసాయి. 22న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో సింధు పెళ్లి 24న హైదరాబాద్‌లో రిసెప్షన్. SAKSHITHA NEWS
రాహుల్ గాంధీ గారూ, ప్రేమను పంచడం అంటే ఇదేనా
SAKSHITHA NEWS రాహుల్ గాంధీ , ప్రేమను పంచడం అంటే ఇదేనా?: వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్ హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ నిలదీత మహిళలు ఇంట్లో ఉండగానే ఇళ్లను కూల్చుతున్నారంటూ ఆగ్రహం మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే అంగీకరిస్తారా? అని…