అంబేద్కర్ కోనసీమ జిల్లా
న్యాయమైన సమస్య పై పోరాటం చేస్తున్న ముస్లిం నేతలపై కేసులు బనాయించడం దుర్మార్గమని అంబేద్కర్ కోనసీమ జిల్లా నవతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికోళ్ల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ…వక్ఫ్ బోర్డు అధికారులు సర్వే పూర్తి అయ్యే వరకు నిర్మాణాలు నిలిపివేయాలని సూచించినప్పటికీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ దారులు పట్టించుకోకపోవడంతోనే ముస్లిం లు నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. అధికారులు కళ్లున్న కబోదుల్లా మారడంతోనే ముస్లిం సమాజం రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. సర్వే పూర్తయ్యే వరకు నిర్మాణం అడ్డుకోకపోగా ముస్లిం లపై కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. దీనిపై డిఎస్పీ కలుగజేసుకుని తక్షణం కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం సమాజానికి నవతరం పార్టీ అండగా వుంటుందన్నారు. కేసులు ఉపసంహరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నందికోళ్ల రాజు హెచ్చరించారు.*