కోడి లింగయ్య సేవలు అభినందనీయం.

Spread the love

కోడి లింగయ్య సేవలు అభినందనీయం.

-మేకల మల్లిబాబు యాదవ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కోడి లింగయ్య తన 37 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలలో ఎంతో హుందాగా నీతిగా నిజాయితీగా సేవలు చేసి, సుదీర్ఘ కాలం పాటు ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహించారని, ఎంతోమంది కలెక్టర్ల ప్రశంసలు పొందారని, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కొనియాడారు. బుధవారం నాడు ఎన్జీవోస్ ఫంక్షన్ హాల్, ఖమ్మం లో ఆర్ ఐ వెంకన్న అధ్యక్షతనజరిగిన కోడి లింగయ్య పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో మల్లి బాబు యాదవ్ కోడి లింగయ్య దంపతులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారుల వద్ద ఎప్పుడూ మాట పడకుండా, మచ్చ లేకుండా అందరి ప్రశంసలు పొందిన వ్యక్తిగా నిలిచిపోయారని, ఉద్యోగ సంఘాలకు నాయకుడిగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే వారని, ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, యాదవ కుల బాంధవులు, రాజకీయ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page