సూపర్ స్టార్ రజనీకాంత్ పై కొడాలి నాని ఫైర్

Spread the love

మూడు రోజులు షూటింగ్ చేస్తే, నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే రజినీకాంత్ తెలుగు ప్రజలకు ఏం చెప్తాడు….
-వైస్రాయ్ హోటల్ లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్, సిగ్గు లేకుండా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నాడు….
-పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజనీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి దింపాడు…..
-ఇకనైనా పవన్ కళ్యాణ్ ఏది మంచో గ్రహించాలి….


సాక్షితగుడివాడ : సూపర్ స్టార్ రజినీకాంత్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతుగా ఉన్న రజినీకాంత్, సిగ్గు శరం లేకుండా ఇప్పుడు చంద్రబాబును పొగుడుతూ, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నాడని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి దింపాడని కొడాలి నాని ఆరోపించారు. ఇకనైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి, తనకు ఏది మంచో ఆధారిలో నడవాలని కొడాలి నాని హితవు పలికారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్, మాటలను తెలుగు ప్రజలేవ్వరు విశ్వసించరని కొడాలి నాని అన్నారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే, రజనీకాంత్ ఏం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చాడని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ బతికుండగా రజనీకాంత్ ఏం చేశాడో రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని…. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను తెలుగు ప్రజలేవ్వరు విశ్వసించరని కొడాలి నాని స్పష్టం చేశారు.

Related Posts

You cannot copy content of this page