SAKSHITHA NEWS

హైకోర్టు ఆర్డర్ ని సైతం ధిక్కరించిన కే ఎన్ ఆర్ హెల్త్ యూనివర్సిటీ,మరియు రాష్ట్ర ప్రభుత్వం

అశ్వారావుపేట సెప్టెంబర్- 21.. సాక్షిత న్యూస్…….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, పూర్వీకుల నుండి తెలంగాణా నే నివాసిత ప్రాంతం. అశ్వారావుపేట గ్రామం లో ఉండే వాళ్ళం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయ్యింది ,మా పాప 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అశ్వారావుపేట లో ఉన్న గుడ్ న్యూస్ హైస్కూల్ లో 2010 to 15 ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదివింది తరువాత జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశం కోసం కేంద్రప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ (2013 -2014) విభజన కు ముందే వచ్చింది సార్, రాష్ట్రం విడిపోకముందే 2014 ఫిబ్రవరి లో ఎగ్జామ్స్ వ్రాస్తే సిటు వచ్చింది.ఆ తరువాత తెలంగాణా రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రక్కన ఉన్న యటపాక -2 నవోదయలో మన తెలంగాణ రాష్ట్రం లోని ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు కు అడ్మిషన్లు ఇచ్చారు ఇది తెలంగాణా కు సంబంధించిన నవోదయ స్కూల్.

అక్కడ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అక్కడే చదివింది. పిల్లలు అడ్మిషన్లు అయిన సంవత్సరానికి ఆ స్కూల్ ముంపు మండలాల లో భాగంగా ఆంధ్ర లో కలిపారు.తరువాత మా పాప ఇంటర్ మీడియట్ కరీంనగర్ లో సోషల్ వెల్ఫేర్ సిఓఈ లో చదివింది సార్. నీట్ విషయం లో ఆంధ్ర లోకల్ చేశారు సార్ . మా పాప కు ఈ సంవత్సరం నీట్ లో 392 మార్కులు వచ్చాయి మన తెలంగాణా లో ఎంబీబీఎస్ సీటు వస్తుంది . ఎస్సీ కేటగిరి ఉంది, మా పాప కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి సీటు వచ్చింది సార్.రేసిడెన్స్, ఆధార్ ప్రూఫ్స్ అన్ని తెలంగాణ నే ఉన్నాయి.

కాబట్టి ఇప్పుడు ఆంధ్రా లోకల్ చేయడం వల్ల మా పాప మెడికల్ సీటు నష్టపోయింది. వివిధ కారణాల వల్ల బయట చదివిన పిల్లల కు రిసిడెన్స్ ను బట్టి లోకల్ స్టూడెంట్స్ గా పరిగణించి మెడికల్ సీట్లు ఇవ్వగలరు అని తెలంగాణ హైకోర్టు ఆర్డర్ జారీ చేసింది . సార్ అలాగే కొంతమంది కి ఇచ్చారు(మొదట కోర్ట్ ను ఆశ్రయించిన వారికి)ఆ తరువాత మేము కోర్ట్ ద్వారా ఆర్డర్ కాపీ తీసుకొని యూనివర్సిటీ లో ఇచ్చాము అప్పుడు ఓకే అన్నారు సార్ తరువాత నాన్ లోకల్ అని మాకు మెయిల్ పెట్టారు.మేము వరంగల్ లోని కేఎన్ఆర్ యూనివర్సిటీ కి వెళ్లి కోర్ట్ ఆర్డర్ ఉండగా మమ్మల్ని నాన్ లోకల్ ఎందుకు చేశారు అని అడిగితే కమిటీ మీటింగ్ లో హరీష్ రావు చెప్పారు అన్నారు .ఇది చాలా దారుణం .కోర్టు చెప్పిన ఇలా చేయడం వలన పాప భవిష్యత్తు పాడైంది అని వేడుకుంటున్నారు

WhatsApp Image 2023 09 21 at 4.31.25 PM

SAKSHITHA NEWS